పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉంటుందంటే..

పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉంటుందంటే..

'సర్దార్ గబ్బర్ సింగ్" రిలీజ్ కాగానే తన లుక్ మార్చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాటిక్ అవతారం వదిలేసి.. తాను రియల్‌గా ఎలా ఉంటానో అలాగే కనిపిస్తున్నాడు పవన్. మీసం తీసేసి.. తెల్లటి జుట్టుతో చాలా వెరైటీగా కనిపిస్తున్నాడు పవన్. ముందు ఈ లుక్ అదోలా అనిపించినా.. తర్వాత జనాలు అలవాటు పడిపోయారు. ఐతే సినిమాల మధ్య వచ్చే విరామంలో ఇలా క్యాజువల్ లుక్‌లో కనిపించడం మామూలే కాబట్టి.. జనాలు ఈ లుక్‌ను క్యాజువల్‌గానే తీసుకున్నారు.

ఐతే రోజులు గడుస్తున్నా పవన్ అవతారం మారడం లేదు. త్వరలో ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తన కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్న నేపథ్యంలో పవన్ లుక్ ఎలా మారుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే తన ఒరిజినల్ లుక్‌తోనే పవన్ ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. తెల్లటి జుట్టును కంటిన్యూ చేస్తూ పెద్ద మీసంతో కనిపిస్తాడట పవన్ ఈ సినిమాలో.

సూర్య దర్శకత్వంలో తాను చేయబోయేది ఓ ఫ్యాక్షనిస్టు లవ్ స్టోరీ అని పవన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదో మిడిలేజ్డ్ పాత్ర కావడంతో పవన్ తెల్లటి జుట్టుతో కనిపిస్తాడట. ఐతే పవన్ లుక్ గురించి సమాచారం చూస్తుంటే.. ఇది తమిళ 'వీరం" సినిమాకు రీమేక్ అని జరుగుతున్న ప్రచారం వాస్తవమే అనిపిస్తోంది. ఆ సినిమాలో హీరో అజిత్‌ది కూడా మిడిలేజ్డ్ క్యారెక్టరే. తెల్లటి జుట్టుతోనే కనిపిస్తాడు. అతడికి రౌడీ బ్యాగ్రౌండ్ ఉంటుంది. లేటు వయసులో ప్రేమలో పడతాడు. కాబట్టి పవన్ 'వీరం" సినిమాను రీమేక్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు