పవన్ సినిమాకు హీరోయిన్ ఫిక్సయిందా?

పవన్ సినిమాకు హీరోయిన్ ఫిక్సయిందా?

నిన్నటి తరం సీనియర్ హీరోలకు హీరోయిన్ల సెలక్షన్ అన్నది ఈ మధ్య చాలా పెద్ద సమస్య అయిపోయింది. పవన్ కళ్యాణ్ మరీ సీనియర్ ఏమీ కాదు కానీ.. అతను కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు ఈ మధ్య. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు కాజల్‌ను ఫిక్స్ చేసే ముందు చాలా గందరగోళమే నడిచిన సంగతి తెలిసిందే. ఇక పవన్ తర్వాతి సినిమా విషయంలోనూ హీరోయిన్ సంగతి తేల్చడానికి బాగానే టైం పడుతోంది. స్క్రిప్టు ఎప్పుడో రెడీ అయిపోయినా.. సినిమాకు ముహూర్తం కూడా పూర్తయినా ఇంకా హీరోయిన్ ఎవరో తేలలేదు. ఎస్.జె.సూర్య చాలా పేర్లను పరిశీలించి చివరికి రెగ్యులర్ హీరోయిన్లు ఎవరూ వద్దనుకుని.. మలయాళ బ్యూటీ పార్వతీ మీనన్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.

‘బెంగళూరు డేస్’ సినిమాతో సౌత్ ఇండియా మొత్తం పాపులరైంది పార్వతీ మీనన్. కమల్ హాసన్ సినిమా ‘ఉత్తమ విలన్’తో ఓ కీలక పాత్ర చేయడంతో పాటు ధనుష్ మూవీ ‘మరియన్’లోనూ హీరోయిన్‌గా నటించిన పార్వతికి మంచి నటిగా గుర్తింపు లభించింది. అందానికి అందం.. నటననకు నటనా ఉన్న ఈ అమ్మాయిని పవన్-ఎస్.జె.సూర్య సినిమాకు హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఐతే ఇప్పటిదాకా కమర్షియల్ సినిమాలు ఒక్కటీ చేయని పార్వతి.. పవన్ సినిమాకు ఎలా సూటవుతుందో అన్న సందేహాలున్నాయి. పవన్‌కు జోడీగా ఆమె బాగానే సూటవ్వొచ్చు కానీ.. ఎలాంటి స్టార్ ఇమేజ్ లేని పార్వతిని పవన్ పక్కన హీరోయిన్‌గా అభిమానులు ఒప్పుకుంటారా..? ఇంతకుముందు అనీషా ఆంబ్రోస్‌ను వ్యతిరేకించినట్లే వ్యతిరేకిస్తారా..? అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు