దిల్ రాజు దాన్ని కూడా తెస్తాడా?

దిల్ రాజు దాన్ని కూడా తెస్తాడా?

తమిళ ఇండస్ట్రీ చాలా ప్రోగ్రెసివ్ అని.. అక్కడి ప్రేక్షకులు కూడా మెచ్యూర్డ్ అని అనుకుంటాం. కానీ అక్కడ కూడా అప్పుడప్పుడూ చాలా సాదాసీదా అనుకున్న సినిమాలు బాగా ఆడేస్తుంటాయి. అందుకు తాజా ఉదాహరణ ‘తెరి’ సినిమా. తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో విడుదలైన ఈ సినిమాను మన ప్రేక్షకులు తిప్పికొట్టారు. కానీ తమిళంలో మాత్రం ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. విజయ్ కెరీర్లోనే ఇది హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం విశేషం. ఈ కలెక్షన్లు చూసి ‘తెరి’కి సీక్వెల్ కూడా తీయడానికి రెడీ అయిపోతున్నాడు డైరెక్టర్ అట్లీ.

శివాజీ ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ తెరి సీక్వెల్‌ను నిర్మించబోతోంది. ప్రస్తుతం విజయ్ తన తర్వాతి సినిమాను సీనియర్ డైరెక్టర్ భరతన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. విజయ్‌కు అది 60వ సినిమా కావడం విశేషం. ఇది పూర్తయ్యేలోపు అట్లీ ‘తెరి’ సీక్వెల్‌కు స్క్రిప్టు పూర్తి చేస్తాడు. ‘తెరి’లో చాలా వరకు హీరో ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో కథ సాగుతుంది. సీక్వెల్లో హీరోకు.. కూతురికి మధ్య అనుబంధం నేపథ్యంలో కథ సాగుతుందట. ఐతే ‘తెరి’ చాలా గొప్ప కథ అని.. ఈ కథను తెలుగోళ్లకు చూపించి తీరాలని.. ఏదేదో చెప్పి ఆ సినిమాను ‘పోలీసోడు’ పేరుతో తెలుగులోకి తెచ్చాడు దిల్ రాజు. కానీ ఆ సినిమా దిల్ రాజుకున్న బ్రాండ్ వాల్యూని దెబ్బ తీసింది. మరి తెరి సీక్వెల్‌ను కూడా రాజు తెలుగులోకి తెస్తాడో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు