వర్మను నమ్మి అంత ఎవరు పెట్టారు?

వర్మను నమ్మి అంత ఎవరు పెట్టారు?

కేవలం రెండున్నర లక్షల బడ్జెట్లోనూ సినిమా తీసేసిన ఘనుడు రామ్ గోపాల్ వర్మ. ‘ఐస్ క్రీమ్’ సంగతి పక్కన పెట్టేస్తే మిగతా సినిమాలకు కూడా పెద్ద ఖర్చేమీ పెట్టించడు వర్మ. ఫారిన్ లొకేషన్లు.. భారీ సెట్టింగులు లాంటివేమీ వర్మ సినిమాల్లో కనిపించవు. నేచురల్ లొకేషన్లలో తక్కువ ఖర్చుతో చాలా తక్కువ రోజుల్లో సినిమా ముగించేస్తుంటాడు. అలాంటివాడు రూ.55 కోట్ల బడ్జెట్‌ తో ఓ సినిమా తీస్తున్నాడంటే నమ్మగలమా..? ఐతే నమ్మి తీరాల్సిందే అంటున్నాడు వర్మ. బెంగళూరు మాఫియా డాన్ ముత్తప్ప రాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘రాయ్’ సినిమా బడ్జెట్ రూ.55 కోట్లని ఈ రోజే వెల్లడించాడు వర్మ.

ఇది తన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ అని కూడా తెలిపాడు వర్మ. అంతే కాదు.. ఈ రోజు సాయంత్రం జరగబోయే ‘రాయ్’ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ వేడుకకు కూడా తన కెరీర్లోనే ఈ సినిమా వేడుకకూ పెట్టనంత ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించాడు వర్మ. 50 వేల మందికి పైగా ఈ వేడుకకు హాజరవుతారని.. భారీ లెవెల్లో బెంగళూరులో ఈ కార్యక్రమం జరుగుతుందని.. స్వయంగా ముత్తప్ప రాయే ‘రాయ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాడని వర్మ తెలిపాడు. ముత్తప్పే వచ్చి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నాడంటే.. ఈ సినిమా విషయంలో ఆయన బ్యాకప్ కూడా ఉండి ఉండొచ్చేమో. లేదంటే ఈ రోజుల్లో వర్మను నమ్మి రూ.55 కోట్లు ఎవరు పెడతారు చెప్పండి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు