నాగ్ క్రేజుని వాడేసుకుంటున్నాడు

నాగ్ క్రేజుని వాడేసుకుంటున్నాడు

లేటు వయసులో యమ స్పీడుమీదున్నాడు అక్కినేని నాగార్జున. ఇక నాగ్ పని అయిపోయిందనుకున్న టైంలో మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి లాంటి హ్యాట్రిక్ హిట్లతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో క్రేజ్ కనిపిస్తోంది నాగ్ సినిమాలకు. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య ఈ క్రేజుని తన సినిమా కోసం వాడేసుకుందామని చూస్తున్నాడు.

చైతూ కొత్త సినిమా ‘ప్రేమమ్’ కోసం నాగార్జునతో వాయిస్ ఓవర్ ఇప్పించాలని చూస్తున్నారట. ‘ప్రేమమ్’ ఒరిజినల్లో ఇలాంటి వాయిస్ ఓవర్లేమీ ఉండవు. ఐతే తెలుగులో నాగార్జున స్టోరీని నరేట్ చేయిస్తే సినిమాకు క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారట. ఇందుకు నాగార్జున సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ‘ప్రేమమ్’ టీజర్ లేదా ట్రైలర్లోనే నాగ్ వాయిస్ వినిపించి సినిమాకు హైప్ తీసుకురావాలని చూస్తున్నారు.

‘ప్రేమమ్’ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది. ఓ వ్యక్తి ఫస్ట్ లవ్‌తో మొదలుపెట్టి.. అతడి పెళ్లి వరకు వివిధ దశల్ని చూపించిన సినిమా ‘ప్రేమమ్’. మలయాళ సినీ చరిత్రలోనే ఓ ల్యాండ్ మార్క్ ఫిలింగా నిలిచిపోయింది ప్రేమమ్. సౌత్ ఇండియాలో మిగతా భాషల ప్రేక్షకులు సైతం ‘ప్రేమమ్’కు బ్రహ్మరథం పట్టారు. ‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. శ్రుతి మినహా ఇద్దరూ మలయాళంలో నటించిన హీరోయిన్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు