సంపూ సినిమా.. చప్పుడే లేదే

సంపూ సినిమా.. చప్పుడే లేదే

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమా విడుదలవుతోందంటే ఆ హంగామానే వేరుగా ఉంటుంది. పబ్లిసిటీ అదిరిపోతుంది. సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. కానీ ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ’ సినిమా విషయంలో మాత్రం అలాంటి హడావుడేం కనిపించట్లేదు. చడీచప్పుడు లేకుండా.. పెద్దగా పబ్లిసిటీ కూడా లేకుండా ఉన్నట్లుండి సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. థియేటర్లు కూడా చాలా తక్కువగా ఇచ్చారు ఈ సినిమాకు. ఆల్రెడీ ‘సరైనోడు’ బాక్సాఫీస్ ను రూల్ చేస్తుండటంతో థియేటర్లు పెద్దగా ఖాళీ అవ్వలేదు. ఖాళీ అయిన థియేటర్లలో మెజారిటీ ‘రాజా చెయ్యి వేస్తే’కు వెళ్లిపోయాయి. ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ’తో పాటు ఇంకో రెండు మూడు చిన్న సినిమాలు రిలీజవుతుండటంతో.. వాటితో పాటు ఉన్న థియేటర్లను పంచుకోవాల్సి వచ్చింది.

మారుతి టీమ్ వర్క్స్ నిర్మించిన ఈ సినిమాలో సంపూ సినిమా హీరోగా కనిపించబోతుండటం విశేషం. ముగ్గురు కుర్రాళ్లు కలిసి సినిమా తీసే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. రాజేష్ పులి దర్శకత్వం వహించాడు. సంపూ మినహాయిస్తే దాదాపుగా అందరూ కొత్తవాళ్లే నటించారు. కాన్సెప్ట్ అదీ వెరైటీగా అనిపిస్తున్నా.. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా అనిపించినా.. పెద్దగా ప్రమోషన్ లేకుండా రిలీజవుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు