సుక్కు ఫ్రెండు చిరుని ఎలా చూపిస్తాడో?

సుక్కు ఫ్రెండు చిరుని ఎలా చూపిస్తాడో?

చిరంజీవి 150వ సినిమా ముహూర్తానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆ సినిమాకు సంబంధించి ఒక్కో విశేషం బ‌య‌టికి వ‌స్తోంది. లేటెస్టుగా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ ఎవ‌ర‌న్న‌ది కూడా క‌న్ఫ‌మ్ అయింది. 'రోబో' లాంటి ల్యాండ్ మార్క్ ఫిలింకి ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌డంతో పాటు.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్య.. జ‌గ‌డం.. 1 నేనొక్క‌డినే.. సినిమాల‌కు ప‌ని చేసిన అత‌డి ఫ్రెండు ర‌త్న‌వేలు చిరంజీవి 150వ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ గా ఎంపికయ్యాడు. ర‌త్న‌వేలు వి.వి.వినాయ‌క్ సినిమాకు ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌బోతుండ‌టం ఇదే తొలిసారి.

వినాయ‌క్ స్ట‌యిల్.. ర‌త్న‌వేటు స్ట‌యిల్ చాలా డిఫ‌రెంటుగా ఉంటాయి. మ‌రి వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్లో రాబోయే సినిమా ఎలా ఉంటుందో.. ర‌త్న‌వేలు త‌న కెమెరాతో చిరును ఎలా చూపిస్తాడో చూడాలి. ర‌త్న‌వేలు ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుతో బ్ర‌హ్మోత్స‌వం సినిమాకు ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నాడు. చిరు 150 మూవీకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. మిగ‌తా టెక్నీషియ‌న్స్‌.. న‌టీన‌టుల వివ‌రాలు శుక్ర‌వారం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా వెల్ల‌డించే అవ‌కాశ‌ముంది. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ట‌యిన 'క‌త్తి'కి రీమేక్ గా వ‌స్తున్న ఈ సినిమాకు 'క‌త్తిలాంటోడు' అనే టైటిల్ అనుకుంటున్నారు. చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణే ఈ చిత్రానికి నిర్మాత‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English