సరైనోడులో మాధ‌వ‌న్, వివేక్ ఒబేరాయ్..

సరైనోడులో మాధ‌వ‌న్, వివేక్ ఒబేరాయ్..

అదేంటి.. సరైనోడు సినిమాలో మాధవన్, వివేక్ ఒబేరాయ్ అని హెడ్డింగ్ పెట్టారు.. ఇందులో వాళ్లెక్కడ ఉన్నారు అనుకుంటున్నారా..? కన్ఫ్యూజ్ అవ్వొద్దు.. అక్కడ హెడ్డింగ్ నిజమే.. సినిమాలో వాళ్లు లేరు అనేది కూడా నిజమే. కానీ దీని వెనక ఇంకో నిజం కూడా ఉంది. అదే ఆది ఎంట్రీ. సరైనోడులో క్రూయల్ విలన్ గా మెప్పించాడు ఆది. స్మార్ట్ లుక్స్ తో బ్యాడ్ యాక్ట్స్ తో దుమ్ము లేపేస్తున్నాడు ఆది. సరైనోడుతో మంచి ఆప్లాజ్ వస్తోంది ఆది పాత్రకు. మనోడికి ఇప్పట్నుంచి ఇలాంటి పాత్రలే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..!

అయితే సరైనోడులో ముందు ఆది కాదు విలన్. ఈ పాత్ర కోసం వివేక్ ఒబేరాయ్ ను అనుకున్నారు.. కానీ ఆయన డేట్స్ లేని కారణంగా సినిమాను వదిలేసాడు. ఇక మాధవన్ విషయంలోనూ ఇదే జరిగింది. చివరికి ఆది ఈ పాత్రలోకి వచ్చాడు. ఇది ఒకందుకు మంచిదే అయింది. బన్నీ, ఆది ఇద్దరూ యంగ్ స్టర్సే. తెరపై ఈ ఇద్దరూ పోటీ పడి నటిస్తోంటే చూసే ప్రేక్షకులకు కూడా థ్రిల్ అనిపిస్తోంది. అదే వివేక్ ఒబేరాయ్, మాధవన్ లాంటి వాళ్లు ఆది పాత్ర చేసుంటే చూడ్డానికి కాస్త ఎబ్బెట్టుగా అనిపించేదేమో. ఏదేమైనా.. ఎవరు మిస్ చేసుకున్నా చివరికి రావాల్సిన వాళ్ల దగ్గరికే వచ్చి సరైనోడు పాత్ర ఆగిందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు