క్వీన్ ది వన్ సైడ్ లవ్వా..?

క్వీన్ ది వన్ సైడ్ లవ్వా..?

చాలానే ప్రేమలు చూశాం కానీ.. బాలీవుడ్ స్టార్లు హృతిక్ రోషన్.. క్వీన్ కంగనా రనౌత్ ల యవ్వారమే వూర మాస్ గా కనిపిస్తుంది. ఒకరికొకరు నచ్చటం ఒక ఎత్తు. ఒకవేళ నచ్చకుంటే ఎవరి బతుకు వారిది అన్నట్లుగా బతికేయాలే కానీ.. ఆరపణలు.. విమర్శలు.. కేసులు అంటూ రచ్చ రచ్చ చేసుకోవటం వీరిద్దరికే చెల్లుతుంది.

గత కొద్దిరోజులుగా హృతిక్ రోషన్.. కంగనా రనౌత్ ల  మధ్య నడుస్తున్న పంచాయితీ తెలిసిందే. తాజాగా కంగనా గురించి హృతిక్ బరస్ట్ అయ్యాడు. తనను మెంటల్ గా హెరాస్ చేసిందన్న ఆయన.. క్వీన్ ది వన్ సైడ్ లవ్ గా తేల్చేశారు. తనను కంగనా మాత్రమే ప్రేమించిందని.. తాను మాత్రం ప్రేమించలేదన్న హృతిక్.. తనను మానసికంగా ఎంత వేధించిందన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

తనను ప్రేమించాలంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తూ భారీగా మెయిల్స్ చేసేదని.. ఆరు నెలల వ్యవధిలోనే వేల కొద్దీ ఈమొయిల్స్ చేసిన విషయాన్ని వెల్లడించాడు. అంతేకాదు.. 2014 అక్టోబరులో అయితే తన న్యూడ్ ఫోటోను పంపిన కంగనా.. తామిద్దరం తొలిసారి కలిసే సమయంలో జరిగేది ఇదేనంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేసిందట. అంతేకాదు.. నిద్ర లేచింది మొదలు తన గురించి గూగుల్ లో సెర్చ్ చేసేదని.. ఆ విషయాన్ని కూడా తనకు రాసిన ఈమొయిల్స్ లో పేర్కొన్నట్లుగా హృతిక్ చెబుతున్నారు. ఇలాంటి విశేషాలతో ఉన్న ఈ మొయిల్స్ ను హృతిక్ పోలీసులకు అప్పజెబుతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English