‘సర్దార్’ సెట్లో ఏం జరిగింది?

‘సర్దార్’ సెట్లో ఏం జరిగింది?

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా దాదాపు 80 శాతం సెట్టింగ్స్‌ మధ్యే షూటింగ్ చేశారు. ఈ సినిమా కోసం రతన్ పూర్ పేరుతో ఓ గ్రామాన్ని నిర్మించింది ఆర్ట్ డైరెక్షన్ టీమ్. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లో ‘బూత్ బంగ్లా’గా చెప్పుకునే ప్రదేశంలో రతన్ పూర్ గ్రామానికి సంబంధించి భారీ సెట్టింగ్స్ వేసి షూటింగ్ చేశారు. కొన్ని నెలల పాటు ఇక్కడే షూటింగ్ చేసి విడుదలకు కొన్ని రోజుల ముందు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేసింది ‘సర్దార్’ టీమ్. గత కొన్ని రోజులుగా ఇక్కడి సెట్టింగ్స్ అన్నీ తొలగించే పనులు చేస్తున్నారు. ఐతే ఆ క్రమంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా.. శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుందట.

సెట్టింగ్స్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయట. సమాచారం అందుకున్న అగ్నిమాప‌క‌ సిబ్బంది రెండు వాహనాలతో సంఘటన ఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎంత నష్టం వాటిల్లిందన్నది తెలియలేదు. ఐతే ఎండలు భగభగ మండుతున్న నేపథ్యంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం చోటు చేసుకుందని సమాచారం. సినిమాలకు సెట్టింగ్స్ వేయడం ఎంత కష్టమో.. తర్వాత వాటిని తొలగించి.. ఆ ప్రదేశాన్ని పూర్వపు స్థితికి తీసుకురావడం కూడా అంతే కష్టం. సెట్టింగ్స్ తొలగించాక అందులోని వస్తువుల్ని మళ్లీ చాలా రకాలుగా ఉపయోగిస్తారు. మరి అగ్నిప్రమాదం వల్ల ఎంత నష్టం వాటిల్లిందో ఏమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English