శాతకర్ణి కోసం అప్పుడే బయ్యర్ల వేట

శాతకర్ణి కోసం అప్పుడే బయ్యర్ల వేట

సినిమా మొదలై రెండు రోజులు కాలేదు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవ్వలేదు. అప్పుడే బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం ట్రేడ్ సర్కిల్స్‌లో పోటీ మొదలైపోయినట్లు సమాచారం. ఆరంభోత్సవం నాటి హైప్ చూసి.. సినిమా మీద విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నారట బయ్యర్లు. ముందే డీల్ చేసుకుంటే లాభపడొచ్చని.. అడ్వాన్సులిచ్చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ గత సినిమా ‘కంచె’ను అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసి మంచి ఫలితాన్నందుకున్న అబ్జొల్యూట్ తెలుగు సినిమాస్ సంస్థ.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని కూడా తామే రిలీజ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. రూ.3 కోట్లకు సినిమా హక్కుల్ని సొంతం చేసుకుందట ఆ సంస్థ.

ఇలా మరికొందరు బయ్యర్ల కొన్ని ఏరియాలకు ఇప్పుడే డీల్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. క్రిష్ ఈ చిత్రాన్ని సొంత బేనర్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఫైనాన్సుల మీదే సినిమా తీయాల్సి ఉంటుంది కాబట్టి మంచి డీల్స్ వస్తే హక్కులు అమ్మడానికి క్రిష్ కూడా సిద్ధంగానే ఉన్నాడు. రూ.60 కోట్ల దాకా బడ్జెట్ అయ్యే అవకాశమున్న ఈ సినిమాను క్రిష్ సొంతంగా నిర్మించాలనుకున్నపుడు అది పెద్ద సాహసంలాగా కనిపించింది. ఐతే మొన్న ఆరంభోత్సవం నాడు సినిమా మీద జనాల్లో నెలకొన్న ఆసక్తి.. హైప్ చూస్తే.. రూ.60 కోట్ల బడ్జెట్ ఈజీగానే వర్కవుట్ అయిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ఇప్పుడే ఇంత ఆసక్తి ఉంటే.. విడుదల సమయానికి మరింతగా హైప్ నెలకొంటుందని.. బాలయ్య కెరీర్లోనే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు