ఎన్టీఆర్‌తో కలిసి ఎంజాయ్ చేస్తా-తారకరత్న

ఎన్టీఆర్‌తో కలిసి ఎంజాయ్ చేస్తా-తారకరత్న

నందమూరి కుటుంబ కథానాయకుల మధ్య సంబంధాలు అంతంతమాత్రం. బాలయ్యకు.. జూనియర్ ఎన్టీఆర్‌కు సరిగా పడదు. అలాగే ఎన్టీఆర్-తారకరత్న మధ్య సంబంధాలు కూడా ముందు నుంచి బాలేవు. ఒకప్పుడు కళ్యాణ్ రామ్‌, ఎన్టీఆర్‌ల మధ్య కూడా దూరం ఉండేది. కానీ ఇప్పుడు వాళ్లిద్దరూ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. మరోవైపు బాలయ్య-తారకరత్న మధ్య మంచి సంబంధాలున్నాయి. మొత్తానికి నందమూరి హీరోలందరినీ కలిసి చూసే అవకాశం మాత్రం అభిమానులకు లేదు. ఐతే బయట జనాలు అనుకుంటున్నట్లు తమ కుటుంబ కథానాయకుల్లో విభేదాలేమీ లేవంటున్నాడు తారకరత్న. తనకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లిద్దరితోనూ మంచి సంబంధాలే ఉన్నాయన్నాడీ నందమూరి హీరో.

‘‘మా ఫ్యామిలీ హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఎవరికి వాళ్లు షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల కలిసేది తక్కువ. ఐతే కలవడం తక్కువైనంత మాత్రాన మేం కలవనే కలవమనుకుంటే ఎలా? సమయం దొరికినపుడు వాళ్లిద్దరితో పాటు అందరితోనూ కలిసి ఎంజాయ్ చేస్తాను. అందరం బిజీగా ఉండటం వల్ల కలవడం లేదు తప్ప మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’’ అని తారకరత్న చెప్పాడు. హీరోగా తనకు సరైన బ్రేక్ రాకపోవడం గురించి  మాట్లాడుతూ.. ‘‘జీవితం అనేది స్పీడ్ బ్రేకర్ లాంటిది. అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. నేను టైంని నమ్ముతాను. ఎప్పటికైనా నాకూ మంచి టైం వస్తుందన్న ఆశతో ఉన్నాను. ఆ నమ్మకమే లేకుంటే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండేవాణ్నే కాదు. నా టైం ఇంకా రాలేదు అనుకుంటా తప్ప.. నా కెరీర్ విషయంలో అసంతృప్తి లేదు’’ అని తారకరత్న అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు