సినిమాల్ని చంపేస్తున్నారండీ: సమంత

సినిమాల్ని చంపేస్తున్నారండీ: సమంత

ఒక సినిమా ఫలితాన్ని మీడియాలో వచ్చే రివ్యూలు ప్రభావితం చేయలేకపోవచ్చు కానీ సోషల్‌ మీడియా మాత్రం బాగా ఎఫెక్ట్‌ చూపిస్తుందని అంటోంది సమంత. ఒక చిత్రాన్ని చంపేయాలంటే సోషల్‌ మీడియాతో అది సాధ్యమని సమంత అభిప్రాయపడింది. సినిమా విడుదలైంది లగాయతు లక్షల కొద్దీ మెసేజ్‌లు, ట్వీట్లు పోస్ట్‌ అవుతుంటే ఖచ్చితంగా వాటి ప్రభావం లక్షల మందిపై వుంటుందని ఆమె అంటోంది.

వాట్సాప్‌ ద్వారా, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా తమ సందేశాన్ని లక్షల మందికి చేరవేయడం చాలా తేలికైపోయిందని, ఇదంతా ఖర్చు లేని పని కావడంతో తమకి నచ్చని హీరోల సినిమాలపై దురభిమానులు పని గట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ సినిమా అంతంత మాత్రంగా వున్నట్టయితే ఇక దానికి కోలుకునే అవకాశం వుండట్లేదని, సినిమా ఎంతో బాగుంటే తప్ప ఈ రోజుల్లో బతికి బయటపడడం అసాధ్యమని సమంత తనకి తెలిసిన విషయాలని ఏకరవు పెట్టింది. అందుకే తన సినిమా గురించిన మంచి విషయాలని తాను కూడా అలాగే పది మందికీ చేర్చడానికే సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నానని, నెగెటివిటీని జయించడానికి పాజిటివిటీ కంటే మంచి ఆయుధం లేదు కనుక సినిమా రిలీజ్‌ అయిన తర్వాత కొన్ని రోజులు దానికే ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్టు సమంత చెప్పుకొచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు