తాప్సీని పట్టుకోలేక పోతున్నారు

తాప్సీని పట్టుకోలేక పోతున్నారు

దక్షిణాదిలో అనుకున్నంత పేరు రాలేదని, తన టాలెంట్‌ సరిగ్గా వాడుకోలేదని తరచుగా ఫీలవుతుంటుంది తాప్సీ. అయితే బాలీవుడ్‌లో మాత్రం తాప్సీని బాగానే చూసుకుంటున్నారు. ప్రస్తుతం సౌత్‌లో అవకాశాలు లేకపోవడంతో తాప్సీ తన పూర్తి సమయాన్ని హిందీ చిత్రాలకే కేటాయిస్తోంది. లక్కీగా తనకి అక్కడ గ్లామర్‌ హీరోయిన్‌గా పేరు లేకపోవడంతో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించేస్తూ తన తృష్ణ తీర్చుకుంటోంది. పింక్‌ సినిమాలో అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటిస్తోన్న తాప్సీ ఘాజీ అనే చిత్రంలో రాణా దగ్గుబాటితో జత కట్టింది.

ఇంకా తన చేతిలో రన్నింగ్‌ షాదీ.కామ్‌తో పాటు ఆగ్రా కీ దాబ్రా అనే చిత్రాలు కూడా వున్నాయి. హిందీలో వరుసపెట్టి చాలా ప్రామిసింగ్‌ సినిమాలు తనకి రావడం, షూజిత్‌ సర్కార్‌లాంటి వారు తనని ఎంకరేజ్‌ చేస్తుండడంతో తాప్సీ ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయి. పింక్‌ రిలీజ్‌ అయిన తర్వాత తన రాత మారిపోతుందని తాప్సీ అంటోంది. మరో పది రోజుల షెడ్యూల్‌తో ఈ చిత్రంలో తన పని అయిపోతుందట. ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఈ సినిమా రిలీజయ్యే వరకు ఎదురు చూపులతోనే గడిపేస్తుందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English