నా పెళ్లి జోక్ బాగుంది అంటోంది

నా పెళ్లి జోక్ బాగుంది అంటోంది

స్టార్ హీరోయిన్ల పెళ్లి గురించి మీడియాలో వార్తలు రావడం.. వాళ్లు ఆ వార్తల్ని ఖండించడం మామూలే. ఐతే ఈ విషయంలో ఒక్కొక్కరి రెస్పాన్స్ ఒక్కోలా ఉంటుంది. కొందరు సీరియస్ గా స్పందిస్తారు.. ఇంకొందరు సరదాగా రెస్పాండవుతారు. తమన్నా రెండో రకమే. మిల్కీ బ్యూటీ పెళ్లి ఫిక్సయింది అంటూ రెండు మూడు రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి.

దీని గురించి తమ్మూ స్పందిస్తూ.. తన పెళ్లి మీద మీడియా వాళ్లు వేసిన జోకులు బాగున్నాయి అంటూ సెటైర్ వేసింది. తన పెళ్లి గురించి వచ్చిన వార్తలు శుద్ధ అబద్ధమని.. తన కెరీర్ అద్భుతంగా సాగిపోతున్న ఈ తరుణంలో తానెందుకు పెళ్లి చేసుకుంటానని ప్రశ్నించింది తమ్మూ. ప్రస్తుతం తన ప్రొఫెషన్లో తాను క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నానని తమన్నా చెప్పింది. తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నపుడు బయటి ప్రపంచానికి చెప్పడానికి తనకెలాంటి ఇబ్బందీ లేదని తమ్మూ తెలిపింది.

ప్రస్తుతం తాను ప్రభుదేవా హీరోగా ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హార్రర్ కామెడీ ‘అభినేత్రి’ షూటింగులో బిజీగా ఉన్నానని తమన్నా తెలిపింది. తమిళంలో విజయ్ సేతుపతికి జంటగా నటించిన ‘ధర్మ దురై’ విడుదలకు సిద్ధమవుతోందని.. ఇంకా దక్షిణాదిన మూణ్నాలుగు క్రేజీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయిన తమన్నా చెప్పింది. బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ సరసన కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తమ్మూ కన్ఫమ్ చేసింది.