సుధీర్ ను బాగా హైలైట్ చేస్తున్నారుగా..!

సుధీర్ ను బాగా హైలైట్ చేస్తున్నారుగా..!బాలీవుడ్ కి దక్షిణాది నటులు వెళ్లడం ఇప్పుడే తొలిసారి కాదు. చిరంజీవి నుంచి నిన్నమొన్నటి రామ్ చరణ్ వరకు చాలా మంది బాలీవుడ్ కి వెళ్లొచ్చారు. కానీ అక్కడి వాళ్లు మనోళ్లను అంత స్టార్ లుగా మాత్రం ట్రీట్ చేయరు. ఇక్కడ ఎంత పెద్ద హీరో అయినా.. అక్కడ మాత్రం వాళ్లకంటే తక్కువే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. బాహుబలి తర్వాత మన ఇండస్ట్రీని వాళ్లు గౌరవించడం మొదలుపెట్టారు. ఇక్కడి నటులకు ప్రత్యేక మైన గౌరవం ఇస్తున్నారు. ఇప్పుడు సుధీర్ బాబు విషయంలో ఇదే జరుగుతుంది.

తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు పూర్తైనా.. ఇప్పటి వరకు ఇక్కడ సుధీర్ బాబుకు స్టార్ ఇమేజ్ రాలేదు. ఇప్పుడు బాఘీ సినిమాతో ఉత్తరాది ఇండస్ట్రీకి వెళ్తున్నాడు సుధీర్. అక్కడ మన హీరోకి చాలా మర్యాదలే ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే హీరో కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కేవలం సుధీర్ బాబు విజువల్స్ పై బాఘీ ట్రైలర్ ను విడుదల చేసారు దర్శకనిర్మాతలు. వర్షంకు రీమేక్ గా తెరకెక్కిన బాఘీలో రాఘవ్ పాత్రలో నటించాడు సుధీర్. గోపీచంద్ చేసిన విలన్ పాత్ర అక్కడ సుధీర్ చేసాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటానని ధీమాగా చెబుతున్నాడు సుధీర్ బాబు. ఎప్రిల్ 29న బాఘీ విడుదల కానుంది. మరి చూడాలి.. బాలీవుడ్ లో సుధీర్ కు ఎలాంటి లాంఛింగ్ ప్యాడ్ దొరుకుతుందో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు