సీనియర్ ప్రొడ్యూసర్ కు వెంకీ సాయం..

సీనియర్ ప్రొడ్యూసర్ కు వెంకీ సాయం..

వెంకటేశ్ జోరు పెంచేసాడు. గోపాలా గోపాలా తర్వాత ఎనిమిది నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న వెంకీ.. ఇప్పుడు ఆ లోటు పూడ్చడానికి ట్రై చేస్తున్నాడు. వరసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు ఈ సీనియర్ హీరో. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమా చేస్తున్నాడు వెంకటేశ్. జూన్ నాటికి ఈ సినిమా పూర్తైపోతుంది. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో పోలీస్ గా నటిస్తున్నాడు వెంకీ. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా బాబు బంగారం తెరకెక్కుతోంది.

ఈ సినిమా సెట్స్ పై ఉన్నపుడే కిషోర్ తిరుమలతో ఓ సినిమాకు ఓకే చెప్పాడు వెంకీ. నేను శైలజతో ఆకట్టుకున్న ఈ దర్శకుడు.. వెంకీతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు తాజాగా మరో సినిమా కూడా వెంకటేశ్ ఖాతాలోకి చేరిపోయింది. ఒకప్పుడు వెంకీతో శత్రువు, దేవీపుత్రుడు లాంటి సినిమాలు చేసిన నిర్మాత ఎమ్మెస్ రాజుతో ఓ సినిమాకు కమిటయ్యాడు ఈ ఫ్యామిలీ హీరో. మరో నిర్మాత అంజిరెడ్డితో కలిసి ఎమ్మెస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే మారుతి సినిమా తర్వాత వెంకీ చేయబోయే సినిమా ఇదే అంటున్నారు. ఫాం కోల్పోయిన నిర్మాత ఎమ్మెస్ రాజు మళ్లీ లైన్ లోకి వచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు