నందమూరి హీరోని హడలెత్తిస్తున్నాడు

నందమూరి హీరోని హడలెత్తిస్తున్నాడు

ఒక స్టార్‌ డైరెక్టర్‌తో పని చేసే అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోన్న కళ్యాణ్‌రామ్‌కి ఎట్టకేలకు పూరి జగన్నాథ్‌తో వర్క్‌ చేసే ఛాన్స్‌ వచ్చింది. తనకి స్టార్‌ హీరోలు డేట్లు ఇవ్వకపోవడంతో, ఎన్టీఆర్‌ని మళ్లీ మెప్పించడం కోసమని కళ్యాణ్‌రామ్‌ బ్యానర్లో అతనితో సినిమా చేయడానికి పూరి జగన్నాథ్‌ అంగీకరించాడు. అయితే ఆ సినిమా ఇంకా మొదలైనా కాకముందే పూరి వివాదంలో ఇరుక్కున్నాడు. బయ్యర్లపై అసత్య ఆరోపణలు చేసాడంటూ వారి సంఘం అతనంటే మండి పడుతోంది.

రాబోయే పూరి సినిమాలని బ్యాన్‌ చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు రూమర్స్‌ వినిపిస్తున్నాయి. అదే జరిగితే ముందుగా ఎఫెక్ట్‌ అయ్యేది కళ్యాణ్‌రామే. కిక్‌ 2 ఫ్లాప్‌ నుంచి అతను ఇంకా కోలుకోనే లేదు. ఇలాంటి టైమ్‌లో పూరికి అంత పారితోషికం ఇచ్చి సినిమా చేస్తున్నది బిజినెస్‌ బాగా అవుతుందనే. ఆ సినిమాని బయ్యర్లు కనుక పక్కన పెట్టినట్టయితే కళ్యాణ్‌రామ్‌కే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం మిగతావాళ్లు ఎంత చూస్తున్నారనేది తెలియదు కానీ కళ్యాణ్‌రామ్‌ మాత్రం ఇది త్వరగా కొలిక్కి వచ్చి పూరితో బయ్యర్లకి సామరస్యం కుదరాలని కోరుకుంటున్నాడు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందంటే ఇదేనేమో కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు