రమ్యకృష్ణ తో నారా రోహిత్ గొడవేంటి...

రమ్యకృష్ణ తో నారా రోహిత్ గొడవేంటి...

వేగం.. వాయు వేగం.. స్పీడ్.. ఇలా ఎన్ని పదాలుంటే అన్ని నారా రోహిత్ కెరీర్ కు బాగా సూటవుతాయి. ఈ కుర్ర హీరో జోరు ముందు ఇండస్ట్రీలో ఏ హీరో నిలబడడేమో..! ఎక్కువ సినిమాలు చేతిలో ఉన్న వాళ్లే నెంబర్ వన్ హీరో అంటే ఏడాది కాలంగా నారా రోహిత్ తప్ప ఇండస్ట్రీలో మరెవ్వరూ నెంబర్ వన్ కాలేరు. మనోడి చేతిలో ప్రస్తుతం అరడజన్ సినిమాల కంటే ఎక్కువే ఉన్నాయి. ఏ సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడో తెలియనంత బిజీగా ఉన్నాడు రోహిత్. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమా కూడా రోహిత్ ఖాతాలో చేరిపోయింది.

కొత్త దర్శకుడు పవన్ మల్లెల తెరకెక్కించబోయే చిత్రంలో నారా రోహిత్ హీరోగా నటించబోతున్నాడట. రమ్యకృష్ణ ఇందులో కీలకపాత్రలో నటించబోతున్నారు. నారా రోహిత్ రమ్యకృష్ణ కాంబినేషన్, కథ, కథనం చాలా కొత్తగా ఉండబోతున్నాయని సమాచారం. అన్నట్టు నారా రోహిత్ ఎట్టకేలకు ఈ సినిమా కోసం బరువు తగ్గుతున్నాడట. ఏం చేసైనా సరే స్లిమ్ గా మారాలనుకుంటున్నాడట. రాజా కథ, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఆగస్ట్ నుంచి షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో జ్యో అచ్చుతానంద చిత్రంలో నటిస్తున్నాడు రోహిత్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు