ఆ సినిమా శాటిలైట్ రేటు డబులైంది

ఆ సినిమా శాటిలైట్ రేటు డబులైంది

యువ కథానాయకుడు రామ్ గత ఏడాది 'శివమ్' లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. దాని తర్వాత 'నేను శైలజ' మొదలైంది. ఈ రెండు సినిమాల్నీ రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోరే నిర్మించాడు. ఐతే 'శివమ్' ఎఫెక్ట్ 'నేను శైలజ' మీద పడి.. దీన్ని శాటిలైట్ రైట్స్ అమ్ముదామంటే ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదట. అడిగిన వాళ్లు కూడా చాలా తక్కువ రేటుకు ప్రపోజల్ పెట్టారట. దీంతో విడుదల తర్వాత చూసుకుందాం అని వెయిట్ చేశారు రవికిషోర్. సినిమా సర్ ప్రైజ్ హిట్టయింది. విడుదలకు ముందు అడిగిన రేట్లకు మూణ్నాలుగు రెట్ల ధరకు శాటిలైట్ రైట్స్ అడిగారని చెప్పుకొచ్చారు రవికిషోర్.

ఇప్పుడు 'ఈడోరకం ఆడోరకం' సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నిజానికి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విడుదలకు ముందే ఓ మోస్తరు ధరకు అమ్మేయడానికి డీల్ కుదిరిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ డీల్ పూర్తి కాలేదట. ఈ లోపు సినిమా రిలీజైంది. అంచనాల్ని మించి పెద్ద హిట్టయింది. తొలి రోజు డల్ నోట్ తో మొదలైన ఈ సినిమా.. హిట్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి మంచి కలెక్షన్లు రాబడుతోంది. రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతూ ఉన్నాయి. లిమిటెడ్ బడ్జెట్‌తో తీయడం వల్ల.. తక్కువ రేట్లకే అమ్మడం వల్ల వీకెండ్ అయ్యేసరికే బ్రేక్ ఈవెన్‌కు వచ్చేస్తోందీ సినిమా. నిర్మాత అనిల్ సుంకర ముందు అనుకున్నదానికంటే రెట్టింపు ధరకు శాటిలైట్ రైట్స్ అమ్ముకునే స్థితిలో ఉన్నాడిప్పుడు. ఇంతకుముందు డీల్ మాట్లాడిన ఛానెలే.. మంచి రేటుకు సినిమాను కొనడానికి ముందుకొచ్చినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు