రామ్‌ చరణ్‌ బాగానే లైన్లో పెట్టాడు

రామ్‌ చరణ్‌ బాగానే లైన్లో పెట్టాడు

గోవిందుడు అందరివాడేలే అంతంత మాత్రంగా ఆడడం, తుఫాన్‌, బ్రూస్‌లీలు డిజాస్టర్లు కావడంతో రామ్‌ చరణ్‌ మార్కెట్‌పై ప్రభావం పడింది. రొటీన్‌ సినిమాల నుంచి బ్రేక్‌ కోసమని అతను ప్రయోగాత్మకంగా 'తని ఒరువన్‌' రీమేక్‌ చేస్తున్నాడు. చరణ్‌ ఈ చిత్రం చేయడం పట్ల అభిమానులు ఆనందంగా లేరు. తెలుగులో ఈ చిత్రం వర్కవుట్‌ కాదని, ఒకవేళ అయినా కానీ చరణ్‌ని అరవింద్‌స్వామి డామినేట్‌ చేసేస్తాడని వారు ఇప్పట్నుంచే దీని పట్ల అనాసక్తిగా వున్నారు. ఈ సినిమా మాట ఎలా వున్నా కానీ చరణ్‌ తదుపరి చిత్రాల లైనప్‌ మాత్రం సూపర్‌గా వుంది. సుకుమార్‌ తదుపరి చిత్రం చరణ్‌తోనే ఖరారైంది.

ఆరెంజ్‌ తర్వాత పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో చరణ్‌ నటించబోతున్నాడు. ఆ తర్వాతి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తాడు. ఇది మాస్‌ ప్లస్‌ ఫ్యామిలీస్‌ని టార్గెట్‌ చేసే పక్కా కమర్షియల్‌ చిత్రమట. ఇక మారుతి దర్శకత్వంలో నటించడానికి కూడా చరణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసాడు. మొదటిసారి తనకో సూపర్‌స్టార్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం రావడంతో మారుతి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఇప్పట్నుంచే తపిస్తున్నాడు. చరణ్‌ లేట్‌ చేయకుండా వెంటవెంటనే ఈ సినిమాలు పూర్తి చేసినట్టయితే రేసులో మళ్లీ ముందుకు రావడం అంత కష్టమేం కాదు. సినిమాకీ, సినిమాకీ మధ్య గ్యాప్‌ ఎక్కువ తీసుకుంటున్నాడనే విమర్శలు వున్నా కానీ 'తని ఒరువన్‌' డిలే అవుతుండడానికి కూడా చరణే కారణమవుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు