యాక్షన్ హీరో పెద్ద సాహసమే చేస్తున్నాడే..

యాక్షన్ హీరో పెద్ద సాహసమే చేస్తున్నాడే..

హీరోలు మెగా ఫోన్ పట్టడం అరుదుగా జరుగుతుంటుంది. దర్శకత్వంలో సక్సెస్ అయిన హీరోలు చాలా తక్కువమంది. కొందరి వాలకం చూస్తేనే ఆ హీరోలో డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయో లేదో చెప్పేయొచ్చు. కమల్ హాసన్ లాంటి క్రియేటివ్ జీనియస్‌లు ఇందుకు ఉదాహరణ. కమల్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎన్ని కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి అని పక్కనబెడితే.. ఆయనలో గొప్ప దర్శకుడున్నాడు అన్నది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిన సత్యం. ఐతే బాలీవుడ్లో యాక్షన్ సినిమాలు.. కామెడీ మూవీస్ చేసే అజయ్ దేవగన్ మెగా ఫోన్ పడుతున్నాడంటేనే చాలామందికి సందేహాలు కలుగుతున్నాయి. అతణ్ని చూస్తే డైరెక్షన్ చేసేంత సీన్ ఉందా అని బాలీవుడ్ వర్గాల్లోనే సెటైర్లు పడుతున్నాయి. ఐతే అజయ్ మాత్రం అదేం పట్టించుకోకుండా సొంత బేనర్లో ఓ భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఆ సినిమా పేరు.. శివాయ్. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలైపోయింది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇదొక పక్కా యాక్షన్ మూవీ అట. తెలుగులో ‘అఖిల్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సాయేషా ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. చిన్నమ్మాయిలా కనిపించే సాయేషా.. అజయ్ లాంటి సీనియర్ పక్కన ఎలా సూటవుతుందా అన్న సందేహాలున్నాయి. ఈరోస్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది దీపావళికి ‘శివాయ్’ విడుదల కాబోతోంది. అదే సమయానికి షారుఖ్ ఖాన్ మూవీ ‘రయీస్’ కూడా షెడ్యూల్ అయి ఉంది. అసలు డైరెక్షన్ చేయడమే సాహసమంటే.. షారుఖ్ సినిమాకు పోటీగా రిలీజ్ చేయడమంటే ఇంకా పెద్ద రిస్క్. మరి అజయ్ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English