ఆరు రోజుల్లో ‘సర్దార్’ తెచ్చింది అంతేనా?

ఆరు రోజుల్లో ‘సర్దార్’ తెచ్చింది అంతేనా?

‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు వచ్చిన కలెక్షన్లు చూసి జనాలకు మతిపోయింది. ఒక్క రోజులోనే రూ.31 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఈ ఊపు ఓ వారం రోజులు కొనసాగిస్తే పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేయడం.. పాత రికార్డులు బద్ధలవడం ఖాయం అని అనుకున్నారు. కానీ ‘సర్దార్’ది ఆరంభ శూరత్వమే అయింది. తొలి రోజు తర్వాత శని, ఆదివారాల్లోనే కలెక్షన్లు డ్రాప్ అయిపోగా.. సోమవారం నుంచి పరిస్థితి దారుణంగా తయారైంది. తొలి వారం వసూళ్ల లెక్కలు చూస్తుంటే.. సర్దార్ కలెక్షన్లలో తొలి రోజుకు, ఆ తర్వాతి ఆరు రోజులకు చాలా తేడా కనిపిస్తోంది. ఒక్క రోజులో రూ.31 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ‘సర్దార్’.. ఆ తర్వాతి ఆరు రోజుల్లో కలిపి వసూలు చేసిన గ్రాస్ రూ.42 కోట్లు మాత్రమే.

తొలి వారం ప్రపంచవ్యాప్తంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రూ.73.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇందులో షేర్ రూ.47 కోట్లు. కొన్ని ఏరియాల్లో నాన్-బాహుబలి రికార్డులు బద్దలు కొట్టినా సరే.. చివరికి ‘సర్దార్’ పెద్ద డిజాస్టర్‌గానే నిలవబోతోందని ఈ కలెక్షన్లను చూస్తే అర్థమవుతోంది. వైజాగ్‌లో రూ.4 కోట్లు.. పశ్చిమగోదావరిలో రూ.3.55 కోట్లు.. ఆంధ్రా ఏరియా మొత్తంలో రూ.18.7 కోట్లు.. సీడెడ్‌లో రూ.7.2 కోట్లు కలెక్ట్ చేసి.. తొలి వారం వసూళ్లలో నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టింది ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఐతే ఈ ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే మాత్రం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. నైజాంలో తొలి వారమంతా కలిపితే వచ్చింది. రూ10.65 కోట్లే. డిస్ట్రిబ్యూటర్ లాభం చూడాలంటే ఇంకా పది కోట్లు వసూలు చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకో రూ.2 కోట్లు వస్తే ఎక్కువ అన్నట్లుంది. ఫుల్ రన్ అయ్యేసరికి ‘సర్దార్’ కనీసం రూ.30 కోట్ల లాస్ వెంచర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు