సర్దార్ ను తరిమేస్తున్న మంచు బాబు

సర్దార్ ను తరిమేస్తున్న మంచు బాబు

‘సర్దార్ ’ స్క్రీన్లనే  మంచు బాబుతీసి దీనికిస్తున్నారు. మొత్తానికి మంచు విష్ణు చాన్నాళ్ల తర్వాత ఓ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకునేలాగే ఉన్నాడు ఈ ఊపు చూస్తుంటే.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ వచ్చిన ఆరు రోజులకే రిలీజ్ చేస్తున్నారు.. మరీ ఇంత సాహసమా అంటూ కామెంట్లు చేశారు జనాలు ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాను చూసి. ఎంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. ‘సర్దార్’ను తట్టుకుని ఈ సినిమా నిలబడుతుందా అని సందేహించారు. కానీ ఇప్పుడు ఆ సినిమా వల్ల ‘సర్దార్’ కలెక్షన్ల మీదే ఎఫెక్ట్ పడేలా ఉంది. ఎందుకంటే ‘ఈడోరకం ఆడోరకం’ హిట్ అన్న సంగతి తొలి రోజు సాయంత్రానికే తేలిపోయింది. టాక్ పాజిటివ్‌గా ఉండటంతో ఈ అడ్వాంటేజీని ఫుల్లుగా వాడేసుకోవాలని ‘ఈడోరకం ఆడోరకం’ టీమ్ ఫిక్సయిపోయింది. ఆల్రెడీ ప్రమోషన్లు పెద్ద ఎత్తున మొదలుపెట్టేశారు.

ఇది ‘సూపర్ హిట్’ రకం అంటూ పోస్టర్లు రెడీ చేయడమే కాదు.. ఈ సినిమా చూసి నవ్వకుంటే టికెట్ వెనక్కి పంపండి.. డబ్బులు రీఫండ్ చేస్తాం అంటూ సవాల్ కూడా విసిరింది ‘ఈడోరకం ఆడోరకం’ టీమ్. ఇలాంటి ప్రమోషన్ జనాల్లో ఆసక్తి రేపడం ఖాయం. మరోవైపు తొలి రోజు ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకలేదు కానీ.. పాజిటివ్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు పెంచాలని నిర్ణయించారు. ముఖ్యంగా సీడెడ్లో చాలా వరకు స్క్రీన్లు పెంచుతున్నారు. చాలా వరకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం కేటాయించిన స్క్రీన్లనే తీసి దీనికిస్తున్నారు. మొత్తానికి మంచు విష్ణు చాన్నాళ్ల తర్వాత ఓ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకునేలాగే ఉన్నాడు ఈ ఊపు చూస్తుంటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు