నాగార్జున తప్పు ఒప్పేసుకున్నాడు

నాగార్జున తప్పు ఒప్పేసుకున్నాడు

తాను తన కొడుకుల కెరీర్ల మీద ఇప్పటిదాకా పెద్దగా దృష్టిపెట్టలేదని అంటున్నాడు అక్కినేని నాగార్జున. ఐతే ఈ ఏడాదంతా వాళ్ల మీదే తన ఫోకస్ అంతా ఉండబోతోందని చెప్పాడు. 'ఊపిరి' థ్యాంక్స్ మీట్లో భాగంగా నాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. ''కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య సినిమాను ప్రారంభించాలి. అఖిల్-వంశీ పైడిపల్లి కలిసి చేయబోయే సినిమా కథ ఫైనల్ చేయాలి. ఈ రెండు నెలల్లో నేను చేసే పనులు ఇవే. చైతన్య, అఖిల్ సినిమాల విషయంలో ఇంతకు ముందు నేను మనసు పెట్టలేదు. ఈ సంవత్సరం అదే పనిలో ఉంటాను" అని నాగ్ అన్నాడు.

మంచి జడ్జిమెంట్ స్కిల్స్ ఉన్న నాగ్.. 'అఖిల్' సినిమాను ఎలా ఓకే చేశాడు.. దాని ఔట్ పుట్ చూసి ఎలా సంతృప్తి చెందాడు అని అక్కినేని అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు అప్పుడు. ఇప్పుడు నాగార్జునే స్వయంగా తాను తన కొడుకుల సినిమాల విషయంలో మనసు పెట్టలేదని చెప్పడం విశేషమే. మరి ఆయన ఫోకస్ పెడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇక తన సినిమాల గురించి నాగ్ చెబుతూ.. ''గీతాంజలి, శివ, నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య, మన్మధుడు... ఇలా నేను సాహసంతో చేసిన ఎన్నో ప్రయోగాలు మంచి ఫలితాన్నిచ్చాయి. 'సోగ్గాడే చిన్నినాయనా' చూసి బంగార్రాజూ అన్నారు. 'ఊపిరి చూసి చెమర్చిన కళ్లతో విక్రమాదిత్యా అంటున్నారు. ఇంత కన్నా నటుడికి ఏం కావాలి. ఇదే సాహసంతో తిరుపతిలో హథీరాం బాబా మీద కొత్త సినిమా చేయబోతున్నాను" అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు