చాలామంది కాదన్నాకే రాజ్ తరుణ్

చాలామంది కాదన్నాకే రాజ్ తరుణ్

మంచు మనోజ్ వేరే హీరోలతో కలిసి సినిమాలు చేశాడు కానీ.. మంచు విష్ణు మాత్రం ఇప్పటిదాకా బయటి హీరోలతో కలిసి మల్టీస్టారర్లు చేసింది లేదు. ఐతే తొలిసారి రాజ్ తరుణ్ తో కలిసి ‘ఈడోరకం ఆడోరకం’ చేశాడు. ఐతే ఈ పాత్రకు రాజ్ తరుణ్ ఫస్ట్ ఛాయిస్ మాత్రం కాదట. చాలామంది హీరోల్ని సంప్రదించాక.. ఎవ్వరూ ఒప్పుకోకపోతేనే రాజ్ తరుణ్ ను ట్రై చేశానని విష్ణునే స్వయంగా వెల్లడించాడు. ‘‘నాతో పాటు సినిమా మొత్తం ఉండే ఈ పాత్ర కోసం ముందు చాలామంది హీరోల్ని సంప్రదించాను. కానీ ఎవ్వరూ ఆసక్తి చూపించలేదు. ఆ సమయంలోనే నేను ‘సినిమా చూపిస్త మావ’ చూశాను. రాజ్ తరుణ్ చాలా బాగా నచ్చాడు. మన కథకు ఇతనే కరెక్ట్ అనిపించి అతణ్ని అడిగాను. ఓకే అన్నాడు’’ అని విష్ణు చెప్పాడు.

బాలీవుడ్లో హీరోలందరూ ఎలాంటి ఇగోలు లేకుండా కలిసి మెలిసి సినిమాలు చేస్తున్నారని.. కానీ తెలుగులో అలాంటి ప్రయత్నాలు పెద్దగా జరగట్లేదని విష్ణు విచారం వ్యక్తం చేశాడు. ‘‘హిందీలో కథానాయకులు కలిసి మెలిసి నటిస్తున్నారు. ఆర్థికంగా సినిమాల స్థాయిని పెంచేస్తున్నారు. కానీ మనం మాత్రం బావిలో కప్పల్లా తయారయ్యాం. నేనైతే ఎవరితో కలిసి నటించడానికైనా సిద్ధమే. ఐదు నిమిషాల పాత్ర అయినా ఫర్వాలేదంటా. అంత తక్కువ పరిధి ఉన్నా మెప్పించగలననే నమ్మకం నాకు ఉంది. అలాంటి నమ్మకం మిగతా కథానాయకులకి లేదేమో’’ అని విష్ణు అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English