ఖుషి తర్వాత డిప్రెషన్లో పవన్

ఖుషి తర్వాత డిప్రెషన్లో పవన్

ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే ఏ హీరో అయినా చాలా సంతోషిస్తాడు.. పార్టీలు చేసుకుంటాడు.. తర్వాత మరిన్ని హిట్లు కొట్టాలన్న ఉత్సాహంతో ముందుకెళ్తాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ‘ఖుషి’ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం చూసి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడట. ఇది స్వయంగా పవన్ కళ్యాణే చెప్పిన మాట. ఎందుకిలా అని అడిగితే.. ‘‘అప్పటికే నా ప్రతి సినిమాకూ అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి. ఆ అంచనాల ఒత్తిడిని తట్టుకోలేకపోయేవాడిని. ‘ఖుషి’ మరీ పెద్ద హిట్టయిపోవడంతో నేను చాలా ప్రెజర్ ఫీలయ్యాను. నా సినిమాలపై ఉండే ఆశల్ని ఎలా ఫుల్ ఫిల్ చేయాలి అనుకునేవాడిని. ఎందుకంటే ఇండియన్ సినిమా విషయంలో చాలా పరిమితులుంటాయి.చాలా లేయర్స్ ఉంటాయి. అన్నీ ఉండేలాచూసుకోవాలి. ఇలా ఆలోచించి ఆలోచించి విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఆ సినిమా తర్వాత ఇంకెంతో కాలం సినిమాల్లో కొనసాగకూడదని అనిపించింది. నాలుగైదు సినిమాలతో ముగించేద్దామనుకున్నా. కానీ సరైన విజయాలు రాకపోవడంతో కొనసాగాల్సి వచ్చింది’’ అని పవన్ చెప్పాడు.

తన సినిమాల విషయంలో అంచనాల్ని తట్టుకోవడం తనకు నరకప్రాయమైన విషయమని.. ‘అత్తారింటికి దారేది’ తర్వాత కూడా చాలా ఒత్తిడి అనుభవించానని.. అసలు ఆ సినిమా తర్వాత తనతో పని చేయడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతోనే తాను సొంతంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కథ రాయాల్సి వచ్చిందని పవన్ చెప్పాడు. ‘‘రెండేళ్ల పాటు ఎవ్వరూ నాతో సినిమా చేయడానికి ముందుకు రాకపోవడంతో నా కథతోనే సినిమా చేయాల్సి వచ్చింది. త్రివిక్రమ్ సైతం వెనకడుగు వేశాడు. డబ్బులున్నాయి. పేరుంది. బాధ్యత తీసుకునే వ్యక్తులు లేరు.. ఎవరైనా వస్తారేమో.. టేకాఫ్ అవుతుందేమో అని చూశా. కానీ రాలేదు. నేను నా స్టాఫ్‌ను మెయింటైన్ చేయాలి. డబ్బులు కావాలి. అలాంటి పరిస్థితుల్లోనే నేనే సొంతంగా కథ రాసుకుని సినిమా చేయాల్సి వచ్చింది’’ అని పవన్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English