బాబు ఆక‌ర్ష్ టార్గెట్ మామూలుగా లేదు

బాబు ఆక‌ర్ష్ టార్గెట్ మామూలుగా లేదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ప‌ది మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి చేరిపోగా మ‌రో ఇద్ద‌రు కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సీనియ‌ర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముహుర్తం కోసం చూస్తుండ‌గా...ఓ వైసీపీ ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబును ర‌హ‌స్యంగా క‌లిసిన సంగ‌తి తెలిసిందే. వివిధ జిల్లాల‌కు చెందిన మ‌రో 8 మంది ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నార‌ని తెలుస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబు ఆకర్ష్‌ను దూర‌దృష్టితో చేప‌ట్టార‌ని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి 22 మందిని తన పార్టీలోకి తీసుకువ‌చ్చే టార్గెట్‌ను బాబు పెట్టుకున్నార‌ని స‌మాచారం. 22 సంఖ్య‌నే బాబు ఎందుకు ఫిక్స్ చేసుకున్నరేమిటా అని ఆలోచిస్తున్నారా! ఇది బాబు వ్యూహంలో భాగ‌మేన‌ట‌. వైసీపీ ఎమ్మెల్యేల్లో మూడింట ఒక వంతు మంది పార్టీ నుంచి బయటకొస్తే వారిని ప్రత్యేక వర్గంగా గుర్తించే వెసులుబాటు ఉండడంతోనే 22 అంకెపై ఆయన దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు అవిశ్వాసానికి వెళ్లిన జగన్‌ను ఎలాగోలా శాసనసభలో అడ్డుకున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపైనా డివిజన్‌ కోరగా అనేక నిబంధనలను తెరపైకి తెచ్చి ఓటింగ్‌ రాకుండా జాగ్రత్తలు పడ్డారు. ఇకపై ఆ సమస్యలు ఉత్పన్నం కాకుండా నేరుగా 22 మందిని చేర్చుకోవడం ద్వారా వారిని ఫిరాయింపు చట్టం నురచి రక్షిరచాలన్న భావనతో ఉన్న చంద్రబాబు 22 అంకె కోసం తాపత్రయ పడుతున్నారట!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు