పవన్ కు హీరోయిన్ క్లోజ్ అయితే..?

పవన్ కు హీరోయిన్ క్లోజ్ అయితే..?

హీరోయిన్లతో పవన్ కల్యాణ్ ఎలా వ్యవహరిస్తారు? చాలామందికి ఈ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎందుకంటే.. ఆయనతో నటించిన హీరోయిన్లంతా పవన్ గురించి గొప్పలు చెప్పటమే కాదు.. ఆయనకు సంబంధించిన విషయాలు చెప్పింది లేదు. ‘‘పవన్ సార్ చాలా గ్రేట్.. ఆయన చాలా ప్రొఫెషనల్. అంత స్టార్ అయి అంత సింఫుల్ గా’’ లాంటి మాటలే తప్పించి.. ఆయన గురించి పది మందికి పెద్దగా తెలియని విషయాన్ని బయటకు చెప్పిందే ఉండదు.

తాజాగా పవన్ తో జతకట్టిన అర్షికా దేవి అలియాస్ కాజల్ ఆ లోటును తీర్చేసింది. సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ తో కలిసి చేసిన ఆమె.. పవన్ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. అదే సమయంలో చిరంజీవి కొడుకు రాంచరణ్ కు.. పవన్ కు మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరించింది. చెర్రీ అవుట్ స్పోకెన్ అని.. కానీ పవన్ మాత్రం కాస్త రిజర్వ్ డ్ అన్న తేడాను చెప్పేసిన ఆమె ఇద్దరూ పక్కా ప్రొఫెషనల్స్ అంటూ కితాబు ఇచ్చేసింది. ఇక పవన్ గురించి చెబుతూ.. సెట్ లో పవన్ మాట్లాడేది తక్కువన్న మాటను చెప్పింది.

చాలామందికి తెలియని ఒక విషయాన్ని బయటకు చెబుతూ.. రిజర్వ్ డ్ గా కనిపించినప్పటికీ పవన్ తనకు బాగా క్లోజ్ అయిన వారితో మాత్రం చాలా బాగా మాట్లాడతారని.. సర్దార్ షూటింగ్ సమయంలో పవన్ తో తాను తెగ మాట్లాడేసేదానినని చెప్పుకొచ్చింది. ఎంతవరకో అంత వరకూ అన్నట్లు కాకుండా పవన్ కు కాస్త దగ్గరైతే బాగా మాట్లాడతారన్న కొత్త విషయాన్ని చెప్పింది. మొత్తానికి పవన్ గురించి ఒక కొత్త విషయం చెప్పినందుకు కాజల్ కి థ్యాంక్స్ చెప్పాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English