ఆ సినిమాను పట్టించుకున్నారు.. సంతోషం

ఆ సినిమాను పట్టించుకున్నారు.. సంతోషం

ఈ రోజుల్లో ఓ సినిమాలో క్రేజున్న హీరోలు, టెక్నీషియన్లయినా ఉండాలి. లేదంటే సినిమా ఏదైనా కాంట్రవర్శీలో అయినా చిక్కుకోవాలి. లేదంటే జనాలకు ఆ సినిమా పట్టదు. సీనియర్ నటుడు శ్రీకాంత్‌ హీరోగా నటించే సినిమాలకు ప్రస్తుతం ఏమాత్రం క్రేజ్ ఉందో అందరికీ తెలిసింది. మొన్నా మధ్య ‘టెర్రర్’ అనే మంచి సినిమా చేశాడు. దానికి చాలా మంచి టాక్ వచ్చింది. కానీ ఫలితం లేకపోయింది. ఆ సినిమా గురించి జనాలకు తెలిసేలోపే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. శ్రీకాంత్ మార్కెట్ ఏ స్థాయిలో పడిపోయిందో చెప్పడానికిది రుజువు. ఐతే తన తర్వాతి సినిమా ‘మెంటల్ పోలీస్’ అయినా జనాల్లోకి వెళ్తుందా అని చూస్తున్న టైంలో ఓ వివాదం పుణ్యమా అని దాని గురించి కొంత చర్చ జరుగుతోంది.

‘మెంటల్ పోలీస్’ అన్న పేరుకు తగ్గట్లుగా మెడలో చెప్పుల దండ వేసుకుని పోస్టర్లలో దర్శనమిస్తున్నాడు శ్రీకాంత్. ఐతే పోలీస్ పాత్రను ఇలా కించపరచడం ఏంటంటూ పోలీస్ సంక్షేమ సంఘం తరఫున ఈ చిత్ర బృందానికి లీగల్ నోటీస్ వెళ్లింది. దీనిపై శ్రీకాంత్ స్వయంగా స్పందించాడు. తమ సినిమాను చూస్తే పోలీసులు చాలా గర్వంగా ఫీలవుతారని.. అవసరమైతే ముందే పోలీసులకు ఈ సినిమా చూపించడానికి తాము సిద్ధమని.. వాళ్లేదైనా మార్పులు సూచించినా చేస్తామని చెబుతూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు శ్రీకాంత్. పోలీసుల మనోభావాల్ని కించపరిచే సన్నివేశాలేమీ ఈ సినిమాలో ఉండవని శ్రీకాంత్ స్పష్టం చేశాడు. మరి దీనిపై పోలీసులు ఏమంటారో చూడాలి. ఎలాగైతేనేం తన సినిమా ఇలాగైనా వార్తల్లో నిలుస్తున్నందుకు శ్రీకాంత్ సంతోషిస్తూనే ఉంటాడు. బాబ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాదే పూర్తయినా విడుదలకు నోచుకోవడం లేదు. ఈ వివాదం నేపథ్యంలో చకచకా విడుదలకు ఏర్పాట్లు చేసేస్తే బెటరేమో.

Hero With Gun, Villain With Pen

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు