జంపింగ్ ఎమ్మెల్యేలకు చిక్కులు మొదలయ్యాయి

జంపింగ్ ఎమ్మెల్యేలకు చిక్కులు మొదలయ్యాయి

అధికార పార్టీ ఆఫర్లకు ఊహించుకొని కండువా మార్చుకున్న విపక్ష ఎమ్మెల్యేలకు అసలు తత్వం బోధపడుతోందట. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో కారెక్కిన ఎమ్మెల్యేలకు ఈ సమస్య పీడిస్తోందని చెప్తున్నారు. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావడానికే తాము పార్టీ మారామని పైకి చెప్పినప్పటికి పదవులు ఆశించి పార్టీ మారిన వారే ఎక్కువ మంది అనేది నిజం. అయితే వారి ఆకాంక్షలు నెరవేరడం లేదనేది తాజా మాట.

ఆకర్ష్‌లో భాగంగా కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తంను వదిలి కారు ఎక్కారు. వీరిలో కొంత మంది ఎమ్మెల్సీలకు మరో దఫా అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు మాత్రం మొండి చేయి చూపుతుందన్న విమర్శలు ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, రంగారెడ్డి జిల్లా చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఆదిలాబాద్ జిల్లా ముథోల్ శాసనసభ్యులు విఠల్‌రెడ్డి, ఖమ్మం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పార్టీ మారిన వారిలో ఉన్నారు. వీరితో పాటు పార్టీ మారిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడ టీఆర్ఎస్లో తమ స్థానమేమిటో తెలియకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అధికార పార్టీలో కొనసాగుతున్నామని సంతోషం తప్ప మరే ప్రయోజనం తమకు లేదని చాలా మంది తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.

ఈ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ఈ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటకి ఇతర పదవుల పంపిణీలో మాత్రం వీరిని పట్టించుకోవడం లేదట. నియోజకవర్గాలలోని పనులు, పదవులలో కూడ పాత టీఆర్ఎస్ నాయకులను కలుపుకొని వెళ్లాలని అధిష్ఠానం ఆదేశించడంతో తమతో పార్టీ మారిన నాయకులకు అవకాశాలు రావడం లేదు. నిధుల కేటాయింపులోను మంత్రులు తమకు పెద్దగా ప్రాధాన్యతనివ్వడం లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కనీసం ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఎన్నో కొన్ని నిధులు తీసుకెళ్లేందుకు అవకాశం ఉండేదని, పార్టీ మారడంతో ఇపుడు ఆ అవకాశం లేకుండా పోయిందని పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అధికార పార్టీలో ఉంటే తమకు, తమను నమ్ముకున్న క్యాడర్‌కు ఏదో విదంగా మేలు జరుగుతుందని ఆశించినప్పటికి ఇపుడు అవేమి జరగడం లేదని జంపింగ్ ఎమ్మెల్యేలు తత్వం వివరిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English