బెల్లంకొండ చెప్పి మరీ కొట్టాడు

బెల్లంకొండ చెప్పి మరీ కొట్టాడు

నిర్మాత బెల్లంకొండ సురేష్‌కు మొదటినుండి ఒక అలవాటు ఉంది. తనకు స్క్రిప్ట్‌ నచ్చితే, దానికోసం హీరోని, హీరోయిన్‌ను ఎంత పెట్టయినా సరే ఒప్పిస్తాడు మనోడు. అలానే సినిమా సక్సెస్‌ మీద కూడా అంతే కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. ఇక మనోడి తాజా సినిమా 'తడాఖా' విషయానికి వస్తే చెప్పిందే జరిగింది.

సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌రోజున బెల్లంకొండ ఏం చెప్పాడంటే, ఒకవేళ సినిమా హిట్టవ్వకపోతే అందరూ నా ఆఫీస్‌ దగ్గరకు వచ్చి ధర్నా చెయ్యండి అనేశాడు. ఈయన కాన్ఫిడెన్స్‌ చూసి చాలామంది సెటైర్లు వేశారు కాని, సినిమా రిలీజయ్యాక మాత్రం ఔరా అంటున్నారు. చెప్పినట్లే తడాఖా బాక్సాఫీస్‌ దగ్గర తన తడాఖా చూపించేస్తోంది. ఒక నిర్మాత ఇలా చెప్పిమరీ హిట్టు కొట్టడమనేది మనం ఈ మద్య అరుదుగా చూస్తున్న విషయం.

ఇక తడాఖా హిట్టయ్యింది కాబట్టి, ఇప్పుడు మనోళ్లకు ఆయన బెల్లంకొండ సురేష్‌లాగా కాకుండా, బెల్లంకొండ బాబాగా కనిపిస్తున్నాడట. మరి ఎంతమంది హీరోలు ఈ బాబా దగ్గరకు వెళ్తారో చూద్దాం!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English