ఎన్నాళ్లకెన్నాళ్లకు వచ్చిందో కీర్తి..

ఎన్నాళ్లకెన్నాళ్లకు వచ్చిందో కీర్తి..

కీర్తిసురేష్.. ఈ పేరు రెండు నెలల కిందటి వరకు బాగానే వినిపించింది. నేను శైలజతో తెలుగు ప్రేక్షకుల్ని సైతం బాగానే అలరించింది ఈ భామ. ఆ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. మొదట్లో కీర్తి కోసం స్టార్ హీరోలు కూడా పోటీ పడ్డారు. కానీ సీన్ ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు గానీ సడన్ గా కీర్తిసురేష్ కెరీర్ తలకిందులైంది. ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా ఈ భామకు రాలేదు. తమిళనాట విజయ్ లాంటి సూపర్ స్టార్స్ తో నటించే అవకాశం అందుకున్నా.. తెలుగులో మాత్రం కీర్తిని ఎవ్వరూ పట్టించుకోలేదు.

నేను శైలజ విడుదలైన 100 రోజుల తర్వాత కీర్తిసురేష్ కు మరో తెలుగు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. సిద్ధార్థ్ తెలుగు రీ ఎంట్రీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తార్ తో ఈయన ఓ సినిమా చేయనున్నాడు. లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్ గా కీర్తిసురేష్ ను తీసుకున్నారట. సాఫ్ట్ లవ్ స్టోరీ కావడంతో కీర్తి అయితే ఆ పాత్రకు పర్ ఫెక్ట్ గా సూటవుతుందని వాళ్ల అంచనా. పైగా నేను శైలజలోనూ కీర్తి సురేష్ కనిపించింది అలాంటి పాత్రలోనే. మహేశ్ బాబు సినిమాలోనూ కీర్తిసురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారనే వార్తలు వినిపించినా.. ఇప్పటి వరకు దానిపై క్లారిటీ రాలేదు. మొత్తానికి కనుమరుగైపోతుందేమో అనుకుంటోన్న సమయంలో అనుకోకుండా సిద్ధార్థ్ సినిమాతో మరోసారి తెలుగు వాళ్లను పలకరించడానికి వచ్చేస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు