నయనతారకి లొంగిపోయిన వెంకటేష్‌

నయనతారకి లొంగిపోయిన వెంకటేష్‌

డైరెక్టర్‌ మారుతికి చాలా వేగంగా సినిమాలు పూర్తి చేసే అలవాటుంది. తన సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్‌ తీసుకోవడం అతనికి నచ్చదు. భలే భలే మగాడివోయ్‌ తర్వాత పెద్ద హీరోల కోసం వేచి చూడలేక, సీనియర్‌ హీరో వెంకటేష్‌తోనే సినిమా ఖాయం చేసుకున్నాడు. వెంకీతో అయితే త్వరగా పూర్తి చేసేయవచ్చు అనుకున్న మారుతికి హీరోయిన్‌ రూపంలో ఇబ్బంది ఎదురైంది. ఇందులో హీరోయిన్‌గా నయనతారని ఎంపిక చేసుకుంటే తమిళంలో పిచ్చ బిజీగా వున్న ఆమె అడిగిన టైమ్‌కి డేట్స్‌ ఇవ్వడం లేదు.

ఇప్పటికి హీరోయిన్‌ పార్ట్‌ షూటింగ్‌ చాలా తక్కువ జరిగింది. దీంతో సమ్మర్‌ రిలీజ్‌ ప్లాన్‌కి చుక్కెదురైంది. హీరోయిన్‌ని మార్చేద్దామని మిగతావాళ్లంతా అంటే, వెంకటేష్‌ మాత్రం ఒప్పుకోలేదట. నయనతారతో తనది లక్కీ కాంబినేషన్‌ అని, తమ కాంబినేషన్‌ వల్ల సినిమాకి అదనపు క్రేజ్‌ వస్తుందని చెప్పి ఆమె వచ్చే వరకు వెయిట్‌ చేస్తున్నాడట. హీరోనే హీరోయిన్‌కి లొంగిపోయే సరికి ఇంకెవరూ ఆమెని గట్టిగా అడగలేకపోతున్నారు. ఫలితంగా 'బాబు బంగారం' ఈ జులైకి కానీ విడుదల కాదనేది తాజా సమాచారం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు