అన్ని పనులు చక్కబెట్టిన చరణ్ బాబు..!

అన్ని పనులు చక్కబెట్టిన చరణ్ బాబు..!

వారం రోజులుగా చెల్లి పెళ్లి పనులతో బిజీ బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరీ చెల్లి పెళ్లి బాధ్యత తీసుకున్నాడు చరణ్. ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తయ్యాయి. రిసెప్షన్ కూడా పూర్తైపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టనున్నాడు చెర్రీ. ఇప్పటికే తని ఒరువన్ రీమేక్ షూటింగ్ మొదలుపెట్టారు. అయితే ఇప్పటి వరకు చరణ్ ఇందులో పాల్గొంది కేవలం పది శాతం మాత్రమే. షూటింగ్ అలా మొదలుపెట్టారో లేదో అప్పుడే శ్రీజ పెళ్లి ఫిక్స్ అయిపోవడం.. వెంటనే షూటింగ్ కు బ్రేక్ ఇవ్వడం జరిగిపోయాయి. అంతేకాదు బ్లడ్ డోనర్స్ కి జరిగిన సన్మాన కార్యక్రమంలో తండ్రి చిరుతో పాటు ఉత్సాహంగా పాల్గొన్నారు కూడా.

మరో వైపు చరణ్ లేకపోయినా తని ఒరువన్ రీమేక్ షూటింగ్ మాత్రం యమా జోరు మీదుంది. హైద్రాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. ప్రస్తుతం అరవింద్ స్వామి, పోసాని లాంటి నటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఎప్రిల్ 7 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అందులో చరణ్ కూడా పాల్గొనబోతున్నాడు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగా పూర్తి కానుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే బాగా ఆలస్యమైంది. దాంతో ఇకపై షూటింగ్ కు అస్సలు బ్రేక్ ఇవ్వకూడదని ఫిక్సైపోయాడు రామ్ చరణ్. ఆగస్ట్ లో తని ఒరువన్ రీమేక్ ను విడుదల చేయనున్నారు. అల్లుఅరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ధృవ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. జంజీర్ తర్వాత మరోసారి ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు రామ్ చరణ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English