సునీల్‌ అతనికంటే తీసిపోయాడా?

సునీల్‌ అతనికంటే తీసిపోయాడా?

సునీల్‌కి హీరోగా పదిహేను కోట్ల మార్కెట్‌ వుంది కానీ అతనితో నటించడానికి టాప్‌ హీరోయిన్లు ముందుకి రావడం లేదు. ఒకవేళ ఎవరైనా స్టార్‌ హీరోయిన్‌ అతనితో జత కలిస్తే సునీల్‌ సినిమా మార్కెట్‌ ఉన్నపళంగా మరో అయిదు కోట్లు పెరుగుతుంది. కానీ తనని స్టార్‌ హీరోయిన్లు ఇప్పటికీ కమెడియన్‌లానే చూస్తున్నారని తనకి దొరికిన హీరోయిన్లతోనే సునీల్‌ కాలక్షేపం చేస్తున్నాడు. ఇక్కడ సునీల్‌తో నటించడానికి టాప్‌ హీరోయిన్లు వెనకాడుతుంటే, తమిళంలో మాత్రం స్టార్‌ హీరోయిన్లు శివ కార్తికేయన్‌తో నటించేస్తున్నారు.

టీవీ యాంకర్‌గా, స్టాండప్‌ కమెడియన్‌గా కెరియర్‌ ఆరంభించిన శివ కార్తికేయన్‌తో హన్సికలాంటి స్టార్లు నటించారు. అతని తదుపరి చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించనుంది. దీనికి 'జయం' రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. శివ కార్తికేయన్‌తో కాదు, ఫేస్‌ వేల్యూ ఏమాత్రం లేని ఉదయనిధి స్టాలిన్‌ ప్రతి సినిమాలోను ఒక పెద్ద హీరోయినే వుంటుంది. ఎంత పారితోషికం ఇచ్చినా కానీ సునీల్‌తో నటించడానికి వెనకాడే హీరోయిన్లు వీళ్లతో మాత్రం ఎందుకని రొమాన్స్‌ చేస్తున్నట్టు? సునీల్‌ మరీ వారి కంటే తీసిపోయాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు