సిద్ధూను ఫాలో అవుతున్నావా సమంతా..

సిద్ధూను ఫాలో అవుతున్నావా సమంతా..

తొలి సినిమాతోనే స్టార్ హీరోయన్ స్టేటస్ సంపాదించేసిన సమంత.. ఆ తర్వాత ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. గత ఏడాది ఆమె కెరీర్ కొంచెం డల్ అయినట్లు కనిపించినప్పటికీ.. మళ్లీ ఈ ఏడాది ఊపందుకుంటున్నట్లే ఉంది. ఈ సమ్మర్లో ఒకటికి నాలుగు భారీ సినిమాల్లో సందడి చేయబోతోంది సమంత. ఐతే మామూలుగా స్టార్ హీరోయిన్లు అవకాశాలు తగ్గిపోయాక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంటారు కానీ.. సమంతకు ఇప్పుడే ఆ టైపు సినిమాల మీదికి మళ్లుతుండటం విశేషమే. కెరీర్లో తొలిసారి ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో చేయడానికి సమంత రెడీ అవుతున్నట్లు సమాచారం. ఐతే హీరోయిన్ ఓరియెంటెడ్ అనగానే సామ్.. ఏదో ఉదాత్తమైన పాత్రకు రెడీ అయిపోతుందని అనుకోవద్దు.

సమంత చేయాలనుకుంటోంది ఒక వైవిధ్యమైన థ్రిల్లర్. రెండేళ్ల కిందట సౌత్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘లూసియా’ మూవీ గురించి జనాలు వినే ఉంటారు. బాలీవుడ్ వాళ్లకు సైతం మతి పోగొట్టింది ఈ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని తమిళంలో సిద్దార్థ్ ‘ఎనకుల్ ఒరువన్’ పేరుతో రీమేక్ చేశాడు. తెలుగులోకి ‘నాలోన ఒకడు’గా డబ్ అయిందా సినిమా. లూసియా డైరెక్టర్ పవన్ ఆ తర్వాత ‘యు టర్న్’ పేరుతో కొత్త సినిమా చేశాడు. ఆ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ‘యు టర్న్’ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండి.. ‘లూసియా’కు ఈ సినిమా ఏమాత్రం తీసిపోదని చాటిచెప్పింది. సమంతకు ఈ ట్రైలర్ విపరీతంగా నచ్చేసి దీన్ని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది కూడా. ఈ మధ్య తన ఫ్రెండ్ నాగచైతన్యత కలిసి బెంగళూరు వెళ్లి ఈ సినిమా చూసి వచ్చిందట సమంత. ఈ ఓ లేడీ ఓరియెంటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్‌ను తెలుగు, తమిళ భాషల్లో తనే ప్రధాన పాత్రలో స్వయంగా నిర్మిద్దామని చూస్తోందట సమంత. ఇంతకుముందు సమంత మాజీ ప్రియుడు సిద్దార్థ్ పవన్ సినిమాను రీమేక్ చేస్తే.. ఇప్పుడు సమంత అదే ప్రయత్నంలో ఉండటం భలే కోయిన్సిడెన్స్ కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English