రాజమౌళికి రుణపడిపోయిన టాలీవుడ్..

రాజమౌళికి రుణపడిపోయిన టాలీవుడ్..

జాతీయ అవార్డ్.. ఇది మన తెలుగు సినిమాకు ఎప్పట్నుంచో ఉన్న కల. చిన్నాచితకా సినిమాలకు ఏదో అవార్డులు వస్తున్నాయి గానీ ఉత్తమ చిత్రంగా మన సినిమా జాతీయ స్థాయిలో ఎప్పుడూ అవార్డ్ తీసుకోలేదు. అలాంటి ఓ రోజు వస్తుందని కూడా ఎవ్వరూ కలలు గని ఉండరు. కానీ ఆ రోజు రానే వచ్చింది. బాహుబలితో తెలుగు సినిమా స్థాయి జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ వైడ్ గా ఉత్తమ చిత్రంగా అవార్డ్ వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తొలి సినిమా ఇదే. గతంలో శంకరాభరణం సినిమాకు జ్యూరీ వచ్చింది.

నేషనల్ అవార్డ్ లు అంటే ఎప్పుడూ పక్క ఇండస్ట్రీలకే. ఈ విషయంలో మన కంటే తమిళ ఇండస్ట్రీనే ముందుంది. కానీ ఆరేళ్లుగా ఈ పద్దతి మారింది. రాజమౌళి సినిమాలు వరసగా జాతీయ అవార్డుల పంట పండిస్తున్నాయి. మగధీరకు రెండు.. ఈగకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈగ ఎంపికైతే.. కొరియోగ్రఫీ, విఎఫ్ఎక్స్ విభాగంలో మగధీర అవార్డులు సాధించింది. ఇక ఇప్పుడు బాహుబలి ఏకంగా ఉత్తమ చిత్రం కేటగిరితో పాటు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు సాధించింది. మొత్తానికి మన తెలుగు సినిమా స్థాయిని బాగా పెంచేసిన రాజమౌళికి టాలీవుడ్ రుణపడిపోయిందంతే..!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు