ప.గో.ను మించిపోనున్న తూ.గో.

ప.గో.ను మించిపోనున్న తూ.గో.

పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం అన్ని సీట్లూ టీడీపీ గెలుచుకోవడంతో చంద్రబాబు ఆ జిల్లాకు మంచి ప్రయారిటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కూడా పశ్చిమగోదావరికి పోటీ కానుంది. తూ.గో.లోని వైసీపీ ఎమ్మెల్యేలంతా టీడీపీలోకి చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ జిల్లా కూడా మొత్తం టీడీపీ వశం కానుంది. తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియో జకవర్గాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. తాజాగా విలీన మండలాలు విశాఖ జిల్లా అరకు పార్ల మెంటు నియోజకవర్గ పరిధిలోకి రావడం వల్ల ఏజెన్సీ ఓటరులు కూడా తూర్పులోనే అంతర్భాగమై ఉన్నారు. ఇటు వంటి జిల్లాలో ఈసారి 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, 4 నియోజకవర్గాలైన తుని, ప్రత్తిపాడు, కొత్తపేట, జగ్గంపేట నియోజకవర్గాల నుంచి ఎన్నికైన దాడి శెట్టి రాజా, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, జ్యోతుల నెహ్రూలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషి స్తూ వచ్చారు.

తెలుగుదేశంలో నంబర్-2గా ఉన్న యన మల రామకృష్ణుడు ఈసారి ఎప్పటిలాగే తుని నియోజ కవర్గం నుంచి పోటీ చేయకుండా తన తమ్ముడైన కృష్ణుడ్ని ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. దాడిశెట్టి రాజా చేతిలో కృష్ణుడు ఓటమిపాలయ్యాడు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నిక కావడంలో ఎమ్మెల్సీగా యన మల నామినేటై రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రిగా నియమి తులయ్యారు. తూర్పుగోదావరిలో తెలుగుదేశం పార్టీ రాజకీయమంతా యనమల రామకృష్ణుడు కనుసన్నల్లోనే దా దాపుగా జరుగుతోంది.  అలాంటి యనమల ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి ముద్రగడ పద్మనాభం చేసిన కాపు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ తుని కేంద్రంగా పెద్ద ఎత్తున బీభత్స రాజకీయం చేయాలని చూసినా... అదికా స్తా మిస్‌ఫైర్ అయ్యింది. దాంతో యనమల ఆధిపత్యానికి ఇప్పట్లో డోకా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకత్వంపై ప్రజలకు, ముఖ్యంగా అందులో ఉన్న నాయకులకు భ్రమలు రోజురోజుకు తొలగిపోవడం, పార్టీ కి పెద్దదిక్కుగా ఉన్న జ్యోతుల నెహ్రూకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవి దక్కకుండా రెడ్డి సామాజిక వర్గానికే ఆ పదవి కట్టబెట్టడానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాపు కులస్థులకు, ముఖ్యం గా వైసీపీని నమ్ముకున్న వారి గుండెల్లో అగ్నిమంటలు పుట్టించేలా చేశాయి. నిమ్మకాయల చినరాజప్ప సైతం జ్యో తుల నెహ్రూ తమ పార్టీలో కంటిన్యూ అయ్యి ఉంటే తాను అనుభవిస్తున్న ఉపముఖ్యమంత్రి పదవి ఆయనదేనని వ్యాఖ్యానించడం అగ్నికి ఆయువు ను అందించినట్టు అయ్యింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలంతా జ్యోతుల నేతృత్వంలో టీడీపీలోకి వస్తారని భారీగా ప్రచారం జరుగుతోంది. కాకినాడలో ఉన్న ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డి మాత్రం జగన్‌తో ఉన్న వ్యాపార సంబంధాల కారణంగా వైసీపీలో ఉంటే ఉండొచ్చని టాక్.

ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు వైరీవర్గమైన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పర్వత చిట్టిబాబు ఇటీవలె ఆకస్మి కంగా మరణించడం సుబ్బారావును తెలుగుదేశం పార్టీ వైపునకు వెళ్లేలా చేస్తున్నాయి. జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వడానికి, యనమల రామకృష్ణుడికి కేంద్ర మం త్రి పదవి వచ్చేలా రాజ్యసభకు పంపడం.. అన్నీ ఒకేసారి జరగడానికి కూడా రంగం సిద్ధమౌతుంది.  ఇన్నాళ్లు జిల్లా లో జ్యోతుల నెహ్రూకు పదవి దక్కకపోవడానికి తెలుగు దేశంలో యనమలే కారణం అనే ఒక వాదన ఉంది. అదే యనమల కేంద్రమంత్రిగా వెళితే... జ్యోతుల నెహ్రూ దారి క్లియర్ అవుతుంది. ఇక కొత్తపేట చిర్లజగ్గిరెడ్డికి వైసీపీలో కంటిన్యూ అయ్యేకంటే తెలుగుదేశంలోకి వెళ్లిపోతేనే ని యోజకవర్గం అభివృద్ధి బాగా జరుగుతుంది. రంపచోడ వరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పరిస్థితి కూడా అంతే.  ఇక జ్యోతుల నెహ్రూ తన కుమారుడు నవీన్ కు జడ్జీ ఛైర్మన్ పదవి కావాలని టీడీపీ వద్ద ప్రతిపాదన పెట్టారని సమాచారం. అందుకు టీడీపీ వైపు నుంచి ఊహించని రెస్సాన్సు వచ్చిందని.. నవీన్ కు అ పదవి ఇవ్వడంతో పాటు నెహ్రూకు కూడా పెద్ద పదవులు ఇస్తామని ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు