అనుష్కను వదలవా నాగ్..

అనుష్కను వదలవా నాగ్..

అనుష్కను తన లక్కీ ఛార్మ్ లాగా భావిస్తున్నట్లున్నాడు నాగ్. సూపర్ సినిమాతో ఆమెను టాలీవుడ్‌కు పరిచయం చేయడమే కాక.. డాన్, రగడ, ఢమరుకం సినిమాల్లో ఆమెనే హీరోయిన్‌గా పెట్టుకున్నాడు. కింగ్, కేడి, సోగ్గాడే చిన్నినాయనా సినిమాల్లో ఆమె క్యామియో రోల్స్ చేసింది. లేటెస్టుగా ‘ఊపిరి’ సినిమాలోనూ అనుష్క అతిథి పాత్రలో కనిపించడంతో.. నాగార్జున అనుష్కను వదలడా అంటూ సెటైర్లు వేసేస్తున్నారు జనాలు. నాగ్ సినిమాల్లో ఏదైనా స్పెషల్ లేడీ క్యారెక్టర్ చేయాలంటే అనుష్క తప్ప మరో ఛాయిస్ కనిపించదేమో అన్నట్లు తయారైంది పరిస్థితి. నాగ్‌తో సినిమాలు చేసేవాళ్లంతా అనుష్క కోసమే ఓ స్పెషల్ క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నట్లుంది.

నిజానికి ‘సోగ్గాడే చిన్నినాయనా’లో అనుష్క కనిపించాల్సిన అవసరమే లేదు. కానీ కళ్యాణ్ కృష్ణ కావాలనే ఆ పాత్ర క్రియేట్ చేసినట్లు కనిపిస్తుంది. ‘ఊపిరి’లో అనుష్క పాత్ర అవసరం లేదని చెప్పలేం కానీ.. ఏరికోరి ఆ పాత్రలో అనుష్కనే చూపించడంతో ప్రేక్షకులకు ఓ రకమైన మొనాటనీ వచ్చేసింది. ఇంతకుముందు అనుష్క లీడ్ రోల్ చేసిన ‘సైజ్ జీరో’లో నాగ్ క్యామియో రోల్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఊపిరి’ సినిమాలో ఇంకా అడివి శేష్, శ్రియ కూడా అతిథి పాత్రలు చేయడం విశేషం. అడివి శేష్ ప్రస్తుతం పీవీపీ వాళ్లకు అత్యంత ఆప్తుడిగా మారిపోయాడు. ‘క్షణం’ సినిమాతో ఆ బేనర్‌కు చాలా మంచి విజయాన్నందించాడు. అతను కూడా ‘సైజ్ జీరో’లో ఓ అతిథి పాత్రలో కనిపించాడు. ‘ఊపిరి’లో అనుష్క నాగార్జున మాజీ ప్రేయసిగా కనిపిస్తే.. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకునే వ్యక్తిగా శేష్ కనిపించాడు. చివరికి నాగార్జునకు తోడుగా మారే పాత్రను శ్రియ చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు