గోపిచంద్‌ సాహసమే చేస్తున్నాడు

గోపిచంద్‌ సాహసమే చేస్తున్నాడు

కొత్త పెళ్ళికొడుకు గోపిచంద్‌ త్వరలోనే 'సాహసం' సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ధియేటర్ల వద్ద పెద్ద సాహసమే చేస్తున్నాడు. చంద్రశేఖర్‌ ఏలేటి రూపొందించిన ఈ చిత్రం ట్రయిలర్‌కు మాంచి రెస్పాన్స్‌ వచ్చింది. అబ్బురపరిచే యాక్షన్‌ సీక్వెన్సులు, స్టయిలిష్‌ గుర్రపు స్వారీలు, కారు చేజులు, ఒళ్ళు గగుర్పొడిచే హాలీవుడ్‌ సినిమాలాంటి గ్రాఫిక్స్‌ వెరసి ఈ సినిమాపైన అంచనాలను పెంచేస్తున్నాయి.

అంచనాలు సరే, అసలు ఈ సినిమాకు బడ్జెట్‌ ఏ రేంజ్‌లో పెట్టి ఉంటారు అని జనాలు అడుగుతున్నారు. ఆ గ్రాఫిక్స్‌ను వాటిని చూస్తుంటే ఖచ్చితంగా సినిమాకు 35 కోట్లు వరకు అయ్యేవుంటుందని అనిపిస్తోంది. కాని గోపిచంద్‌ మార్కెట్‌ కెపాసిటి అంత వుందా? అ మధ్యకాలంలో ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయిన గోపిచంద్‌, అంత బడ్జెట్‌ను వీజీగా రాబట్టగలుగుతాడా అని ట్రేడ్‌ వర్గాలు ఖంగారుపడుతున్నాయి. అయితే నిర్మాతలు మాత్రం, డబ్బులు భారీగా వసూలు చేయడం ఖాయం అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English