అద్భుతమైన ఊపిరి.. ఇండస్ట్రీకి కొత్త దారి..

అద్భుతమైన ఊపిరి.. ఇండస్ట్రీకి కొత్త దారి..

కొత్తదనం కోసం పరుగులు పెడుతున్న తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపిరి ఊదింది ఊపిరి. ఆరు పాటలు.. నాలుగు ఫైట్లు.. మూడు కుళ్లు కామెడీ సీన్లు.. ఇలాంటి మూసలో కాకుండా కొత్త తరహా కథతో ఒప్పించాడు మెప్పించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. నాగార్జున, కార్తి లాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నా.. సినిమాలో ఒక్క సీన్ లోనూ హీరోయిజం కనిపించదు. అలా జాగ్రత్త తీసుకున్నాడు దర్శకుడు. తెరపై ఎంతసేపూ విక్రమాదిత్య, శీను పాత్రలే కనిపిస్తాయి కానీ నాగ్, కార్తి కనిపించరు.

ఊపిరి ఫ్రెంచ్ సినిమా ది ఇన్ టచబుల్స్ కు రీమేక్. వరల్డ్ ఎవర్ గ్రీన్ టాప్ 20 మూవీలో ది ఇన్ టచబుల్స్ ఉంటుంది. అలాంటి కథను తీసుకోవడం అంటే ఏ దర్శకుడికైనా సాహసమే. ఏ చిన్న తప్పు జరిగినా విమర్శలు తప్పవు. కానీ తాను తీసుకున్న లైన్ కి చాలా చక్కగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు వంశీ. ఒరిజినల్ లో లేని సన్నివేశాలను కూడా మన ప్రేక్షకులకు తగ్గట్లు మార్చుకుని రాసుకున్నాడు. ఎమోషన్స్ విషయంలో అయితే వంశీకి నూటికి నూరు మార్కులు వేయాల్సిందే. మాస్ సినిమాలు చేసే దర్శకుడు ఇంత అందంగా హ్యూమన్ ఎమోషన్స్ పండిస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు.

వరస విజయాలతో దూసుకుపోతున్న సంగీత దర్శకుడు గోపీసుందర్ ఊపిరికి సంగీతం అందించాడు. మనం, సోగ్గాడే విజయాల తర్వాత నాగ్ చేసిన సినిమా ఊపిరి. ఇక మద్రాస్, కొంబన్ విజయాల తర్వాత కార్తి.. బాహుబలి, బెంగాల్ టైగర్ సినిమాల తర్వాత తమన్నా.. బృందావనం, ఎవడు విజయాల తర్వాత వంశీ పైడిపల్లి చేసిన సినిమా ఊపిరి. ఒక్క హిట్ తో నలుగురి ఖాతాలో హ్యాట్రిక్ పడింది. సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ అనే క్యాప్షన్ తో వచ్చిన ఊపిరి టీం.. అదే స్థాయిలో ఆనందాన్ని పంచారు. మొత్తానికి దారి తప్పుతున్న తెలుగు సినిమాకు కొత్త దారి చూపించారు ఊపిరి టీం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు