ఆమెను సర్వనాశనం చేద్దామనుకుంటున్నారట

ఆమెను సర్వనాశనం చేద్దామనుకుంటున్నారట

జగన్ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ రోజా గళం విప్పారు. తనపై వేసిన సస్పెన్షన్ వేటుపై న్యాయపోరాటం చేస్తున్న ఆమె.. ఏపీ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను రాజకీయంగా సర్వనాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇందుకోసం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితులకు అనుకూలంగా తాను గళం విప్పినందుకే తనపై కక్ష కట్టారని.. తన పార్టీని కాపాడుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొన్నారంటూ మండిపడ్డారు.

ఏపీ అసెంబ్లీలో సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన రోజా.. తనకు జరిగిన అన్యాయం మీద కోర్టులో పోరాటం చేస్తానన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న తప్పులు ముఖ్యమంత్రి ఇంటికి దగ్గరగా.. విజయవాడ చుట్టుపక్కల కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై తాను పోరాటం చేయటంతో ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తూ ఏడాది పాటు సస్పెండ్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు.

మూడు కోట్ల మంది మహిళలకు సంబంధించిన విషయాన్ని తాను లేవనెత్తి.. చర్చకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పిన రోజా.. కాల్ మనీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు వీలుగా అంబేడ్కర్ ఇష్యూను తెర పైకి తీసుకొచ్చి చర్చను పక్కదారి పట్టించినట్లుగా ఆరోపించారు. అంబేడ్కర్ మీద ప్రేమ ఉన్నట్లు చెబుతున్న ఏపీ అధికారపక్షం.. మరి.. అసెంబ్లీలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ సర్కారు వైఫల్యాల్ని గట్టిగా ప్రస్తావించినందుకే తనను అన్యాయంగా సభ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆరోపించిన ఆమె.. తన గోడును చెప్పుకునేందుకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన తనను మార్షల్స్ తో గెంటించారంటూ వాపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు