హౌస్ ఫుల్ బోర్డులు బయటకు తీయండప్పా

హౌస్ ఫుల్ బోర్డులు బయటకు తీయండప్పా

ఎప్పుడో సంక్రాంతికి హాళ్లు నిండటమే. ఆ తర్వాతి రెండు వారాల నుంచి తెలుగు సినిమా వెలవెలబోతూ ఉంది. మధ్యలో 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఒక్కటి మాత్రమే కాస్త క్రౌడ్ పుల్లర్ లాగా కనిపించింది. హౌస్ ఫుల్ బోర్డులకు కొంచెం పని కల్పించింది. ఆ తర్వాత హాళ్లు నిండటం చాలా కష్టమైపోయింది. పరీక్షల సీజన్ కావడంతో సినిమాలకు మహరాజ పోషకులైన యూత్ థియేటర్లకు రావడం తగ్గిపోయింది. దీంతో థియేటర్లు వెలవెలబోయాయి. క్షణం, కళ్యాణ వైభోగమే లాంటి మంచి సినిమాలు వచ్చినా... అవి కూడా జనాల్ని పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించలేకపోయాయి. ఐదారు వారాలుగా హౌస్ ఫుల్ బోర్డులతో అసలు పనే లేకపోయింది.

ఐతే ఈ వారం నుంచి మళ్లీ థియేటర్లు కళకళలాడుతాయని ఆశిస్తున్నారు. మార్చి చివరి వారం వచ్చేసింది కాబట్టి సమ్మర్ సందడి మొదలైపోయినట్లే. ముందుగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్.. ఆ తర్వాత టెన్త్ పరీక్షలు రాస్తున్న వాళ్లు.. ఆపై మిగతా స్టూడెంట్స్ అందరూ.. వరుసగా థియేటర్లలోకి దిగిపోతారు. కాబట్టి థియేటర్లు కళకళలాడటం ఖాయం. బుధవారం హోలీ.. సెలవు రోజు కావడంతో వీకెండ్ కాకపోయినా సందీప్ కిషన్ సినిమా 'రన్' రిలీజ్ చేసేస్తున్నారు. మంచి టాక్ వస్తే పెద్ద సెంటర్లలో హాళ్లు నిండే అవకాశముంది. ఇక శుక్రవారం అక్కినేని నాగార్జున సినిమా 'ఊపిరి' వస్తోంది కాబట్టి సందడి బాగానే ఉంటుంది. హౌస్ ఫుల్ బోర్డులకు బాగానే పని పడుతుంది. ఇక రెండు వారాల తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్' థియేటర్లలోకి దిగాడంటే.. అప్పుడుంటుంది అసలు మజా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు