సెకండాఫ్‌కి ఎన్టీఆర్‌ ఒక్కడే

సెకండాఫ్‌కి ఎన్టీఆర్‌ ఒక్కడే

ఈ ఏడాదిలో అతి ముఖ్యమైన చిత్రాలన్నీ మే నెలాఖరులోగా విడుదలైపోతున్నాయ్‌. దీంతో అక్కడ్నుంచి టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలేం వుండబోవడం లేదు. జూన్‌ తర్వాత వచ్చే సినిమాల్లో ఎన్టీఆర్‌, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న 'జనతా గ్యారేజ్‌' ఒకటే పెద్ద సినిమా. చరణ్‌ చేస్తోన్న 'తని ఒరువన్‌' రీమేక్‌ కూడా ద్వితీయార్థంలో వస్తుంది కానీ దానిని ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేసి స్వయంగా విడుదల చేసుకునే ఆలోచనలో వున్నారు. దీని వల్ల దానికి పెద్ద సినిమా ట్యాగ్‌ తగిలించలేరు.

ఏప్రిల్‌, మే నెలల్లో సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, సరైనోడు, బ్రహ్మూెత్సవం లాంటి భీరీ చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఆ తర్వాత మన పెద్ద హీరోల సినిమాల కోసం మరో ఏడాది వరకు వేచి చూడక తప్పదు. అంటే ఏడు నెలల పాటు పెద్ద సినిమాలు లేకుండా బాక్సాఫీస్‌ నిలబడాలన్నమాట. ఇది చాలా రిస్కుతో కూడుకున్న విషయమే. దీంతో మరోసారి మన వాళ్లకి ప్లాన్‌ చేసుకోవడం రాదనేది తేలిపోయింది. వచ్చే సినిమాలన్నీ ఒకే టైమ్‌లో రిలీజ్‌ చేసుకుని ఒకరి వ్యాపారాన్ని ఒకరు దెబ్బ తీసుకోవడమే తప్ప అన్ని సీజన్లని సమానంగా పంచుకునే అలవాటు అయితే మనవాళ్లకి లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు