అప్పుడే 'బోణి' కొట్టాడట

అప్పుడే 'బోణి' కొట్టాడట

బోణి అనే ఒక సినిమా వచ్చింది గుర్తుందా? సుమంత్‌ హీరోగా, బెంగుళూరు భామ కృతికర్బందాను పరిచయం చేస్తూ వచ్చిన సినిమా 'బోణి'. సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది కాని, మన ఫ్లాప్‌ హీరో మాత్రం అప్పుడే ఒక బోణి కొట్టాడని ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో టాక్‌.

ఇంతకీ ఏం బోణి కొట్టాడనేగా సందేహం. మొన్న జరిగిన ఐపిఎల్‌ మ్యాచుల్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌ ఎవరంటే, కలిసి వచ్చి, ఒకటే చోట కూర్చొని, తరువాత కలసి అక్కడినుండి వెళ్లిపోయిన సుమంత్‌-కృతి కర్బందాలే. బోణి సినిమా టైములో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని జానలు చెవులు కొరుక్కుంటున్నారు. దానికితోడు మనోళ్ళు కూడా కాస్త క్లోజ్‌గా బిహేవ్‌ చేస్తుండటంతో ఇవన్నీ నిజాలనే అన్పిస్తున్నాయి.

అయితే సుమంత్‌ మాత్రం ఎప్పటిలాగానే ఇదంతా జస్ట్‌ ట్రాష్‌, మేము కేవలం ఫ్రెండ్స్‌ అంటూ కొట్టిపాడేశాడు. మరి కృతి ఏమంటుందో చూద్దాం...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English