బన్నీకు హ్యాండ్ ఇవ్వడు కదా..?

బన్నీకు హ్యాండ్ ఇవ్వడు కదా..?

తమిళంలో సంగీత దర్శకుడు అనిరుధ్ కు మంచి క్రేజ్ ఉంది. ఇదే క్రేజ్ తో తనకు తెలుగులో పలు ఆఫర్లు వచ్చాయి. కాని అనిరుధ్ మాత్రం తెలుగు సినిమాలకు పని చేయకుండా తప్పించుకుంటున్నాడు. ముందుగా రాంచరణ్ తన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో అనిరుధ్ తో మ్యూజిక్ చేయించాలనుకున్నాడు కానీ కుదరకపోవడంతో తన ప్లేస్ లో యువన్ శంకర్ రాజా తో మ్యూజిక్ చేయించాడు. అలాగే నితిన్, త్రివిక్రమ్ సినిమా 'అ..ఆ' సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు అనుకున్నారు. కాని మధ్యలో నుండి అనిరుధ్ వెళ్ళిపోయాడు.

తాజాగా బన్నీ, లింగుస్వామీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సినిమాకైనా అనిరుధ్ మ్యూజిక్ చేస్తాడా.. లేదా మధ్యలోనే వెళ్ళిపోతాడో చూడాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కొత్త హీరోయిన్ ను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బన్నీ 'సరైనోడు' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బన్నీ, లింగుస్వామి ల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు