ఆ సినిమా బడ్జెట్ కంటే రీమేక్ రేటు ఎక్కువ

ఆ సినిమా బడ్జెట్ కంటే రీమేక్ రేటు ఎక్కువ

పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి.. సెన్సేషనల్ హిట్టయింది ‘క్షణం’ సినిమా. టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు వచ్చినన్ని ప్రశంసలు మరే సినిమాకూ రాలేదు. ఇండస్ట్రీ జనాలందరూ కూడా ఈ సినిమా గురించి మాట్లాడ్డానికి చాలా ఉత్సాహం చూపించారు. బాలీవుడ్లో సైతం ‘క్షణం’ హాట్ టాపిక్ అయింది. తరణ్ ఆదర్శ్ లాంటి వాళ్లు ఈ సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. పీవీపీ సంస్థ బాలీవుడ్ సెలబ్రెటీలకు ఈ సినిమా స్పెషల్ షో వేసి చూపించింది. ఆ షో చూసి వెంటనే పొట్లూరి వరప్రసాద్ చేతిలో అడ్వాన్స్ పెట్టేశాడట బాలీవుడ్ బడా ప్రొడ్యూరసర్ సాజిద్ నడియాడ్ వాలా. ఈ సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తం రీమేక్ రైట్స్ కింద ఇచ్చినట్లు సమాచారం.

రేటు ఎంత అని చెప్పలేదు కానీ.. సాజిద్ ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి ‘క్షణం’ రీమేక్ రైట్స్ తీసుకున్న మాట వాస్తవమని స్వయంగా హీరో అడివి శేషే చెప్పాడు. ఐతే ‘క్షణం’ బాలీవుడ్ రీమేక్‌లో తనే నటించబోతున్న విషయాన్ని అతను ఖండించాడు. ‘క్షణం’ కారణంగా తనకు బాలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు వస్తున్న మాట వాస్తవమని.. ఐతే ‘క్షణం’ రీమేక్ లో మాత్రం తాను నటించట్లేదని చెప్పాడు శేష్. అసలు ఆ సినిమాలో ఎవరు నటించబోతున్నారో కూడా తనకు తెలియదన్నాడు. ‘క్షణం’ కథ రాయడంతో పాటు.. డైరెక్టర్ రవికాంత్ పేరెపుతో కలిసి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా రాశాడు శేష్. మరి పీవీపీ భారీ లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు.. రీమేక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా భారీగా ఆదాయం తెస్తున్న నేపథ్యంలో అందులో శేష్ కు ఎంత వాటా ఇస్తున్నారో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు