నాగ్ అల్లు అర్జున్ తో కలిస్తే రచ్చే

నాగ్ అల్లు అర్జున్ తో కలిస్తే రచ్చే

కెరీర్ లో ఎప్పుడూ లేనంత హాయిగా, హ్యాపీగా ఉన్నారు నాగార్జున. దీనికి కారణం వరస విజయాలు.. మరో కారణం విభిన్నమైన క్యారెక్టర్లు. మనం, సోగ్గాడే చిన్నినాయనా వంటి చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించాడు నాగ్. ఇక ఇప్పుడు ఊపిరిలోనూ అలాంటి పాత్రే చేసాడు. కుర్చీకే అంకితమయ్యే బిలియనియర్ పాత్రలో నటించాడు గ్రీకువీరుడు. ఈ సినిమాలో నటించిన తర్వాత నాగార్జున మనసు మార్చుకున్నాడు. ఇకపై మల్టీస్టారర్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు నాగార్జున. ఇమ్మీడియట్ గా ఈ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాడు.

నాగార్జున ప్రస్తుతం ఊపిరి ప్రమోషన్స్ లోనే బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఒకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు.. మరొకటి రాఘవేంద్రరావ్ తో నమో వెంకటేశా.. ఇంకోటి త్రివిక్రమ్ తో ఓ సినిమా. వీటిలో త్రివిక్రమ్ సినిమానే ముందు తెరకెక్కనుందని సమాచారం. ఇందులో నాగార్జున సోలో హీరో కాదు.. అల్లు అర్జున్ తో కలిసి ఈయన నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ చెప్పిన కథ నాగ్ కు బాగా నచ్చిందని సమాచారం.

ఇప్పటికే కార్తితో కలిసి నటించిన నాగ్.. అన్నీ కుదిర్తే బన్నీతో నటించడం కూడా ఖాయమే. ఇదే ఊపులో మరిన్ని మల్టీస్టారర్స్ కు కూడా నాగార్జున ఓకే చెప్పేస్తున్నారు. తమిళ హీరో సూర్యతో నాగార్జున ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారనేది తాజాగా వినిపిస్తున్న వార్త. ఇక ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి ఎప్పట్నుంచో వేచి చూస్తున్నా.. కథ కుదిర్తే చేస్తానంటూ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు నాగార్జున. మొత్తానికి వయసు పిలిచే సరికి మనసు మార్చుకోక తప్పలేదు మన గ్రీకువీరుడికి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English