'ఊపిరి"కి అంత రేటు పలికిందా?

'ఊపిరి

ఊపిరి సినిమాకు ఏకంగా రూ.60 కోట్ల బడ్జెట్ పెట్టేసినట్లు చెప్పాడు పొట్లూరి వరప్రసాద్. మరి ఆ స్థాయిలో బడ్జెట్ అంటే.. బిజినెస్ ఎలా వర్కవుట్ చేస్తారబ్బా అని సందేహించారు. ఐతే పీవీపీ మరీ అనాలోచితంగా ఏమీ అంత ఖర్చు పెట్టేయలేదు. ద్విభాషా చిత్రం కాబట్టి.. అందుకు తగ్గ ప్రణాళికలే వేసుకుని సినిమాకు అంత బడ్జెట్ పెట్టాడు. 'ఊపిరి" సంక్రాంతి కంటే ముందు రిలీజైతే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. పండక్కి వచ్చిన నాగార్జున సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా" బ్లాక్బస్టర్ హిట్టవడంతో 'ఊపిరి"కి బాగానే కలిసొస్తోంది. నాగ్ కెరీర్లోనే అత్యధిక రేట్లు పెట్టి ఈ సినిమాను కొంటున్నారు. ఈ సినిమాకు తెలుగులోనే దాదాపుగా రూ.40 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు సమాచారం.

ఆంధ్రాలో అత్యంత పెద్ద జిల్లాలు.. బిజినెస్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ అయిన కృష్ణా, గుంటూరు రెండు జిల్లాలకే రూ.5 కోట్లకు 'ఊపిరి" హక్కుల్ని అమ్మారట. మామూలుగా ఈ రెండు జిల్లాలకు కలిపి నాగార్జున సినిమా రూ.3 కోట్లకు అటు ఇటుగా రేటు పలుకుతుంది. కానీ సోగ్గాడే.. ఇచ్చిన ఊపు, 'ఊపిరి"పై ఉన్న పాజిటివ్ బజ్.. పైగా సినిమా రిలీజవుతున్న సీజన్ చూసుకుని ఓ డిస్ట్రిబ్యూటర్ రెండు జిల్లాలకు కలిపి రూ.5 కోట్లకు హక్కులు తీసుకున్నారు. మిగతా ఏరియాలన్నింట్లో కూడా 'ఊపిరి"కి నాగ్ కెరీర్ హైయెస్ట్ రేట్లే పలికాయి. అమెరికా హక్కులు సైతం రూ.3 కోట్లకు పలకడం విశేషమే. బడ్జెట్ లెక్కలకు సమానంగా బిజినెస్ చేసిన పీవీపీ.. శాటిలైట్ ద్వారా వచ్చే మొత్తాన్ని లాభంగా మిగుల్చుకోనున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు